Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..

ప్రస్తుతం ఓ టాలీవుడ్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. బ్యాక్ టూ బ్యాక్ అనేక హిట్ చిత్రాలతో అడియన్స్ మనసులు గెలుచుకుంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ జోరు కొనసాగిస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..
Sneha

Updated on: Sep 24, 2025 | 1:10 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి తెలుగులో తోపు హీరోయిన్. అందం, అభినయంతో అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. నాగార్జున, వెంకటేశ్, శ్రీకాంత్, గోపిచంద్ వంటి హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. అలాగే ఇప్పుడు యంక్ హీరోల చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తన పేరు సుహాసిని రాజారామ్ నాయుడు .. ఈ పేరు చెబితే అస్సలు గుర్తుపట్టలేరు. కానీ స్నేహ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. తెలుగు, తమిళం, మలయాళం భాషళలో అనేక చిత్రాలలో చెప్పుకోదగ్గ పాత్రలు పోషించిన హీరోయిన్ ఆమె.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..

స్నేహ 2000 సంవత్సరంలో మలయాళ చిత్రం ‘ఇంగానే ఒరు నీలపక్షి’ తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ సంవత్సరం తరువాత, మాధవన్ సరసన తమిళ చిత్రం ‘ఎన్నావాలే’ లో నటించింది. ఆ తర్వాత తెలుగులో గోపిచంద్ జోడిగా తొలివలపు చిత్రంలో నటించింది. 2004లో విడుదలైన ‘ఆటోగ్రాఫ్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అలాగే ‘రాధా గోపాలం’లో ఆమె నటనకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకుంది. స్నేహ మమ్ముట్టి సరసన ‘తురుప్పుగులన్’, ‘గ్రేట్ ఫాదర్’ చిత్రాల్లోనూ, మోహన్ లాల్ సరసన ‘షిక్కర్’ చిత్రంలోనూ హీరోయిన్ గా నటించింది.

ఇవి కూడా చదవండి : Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ఈ అమ్మడు..

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే కోలీవుడ్ హీరో ప్రసన్న కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి బాబు, పాప ఉన్నారు. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న స్నేహ.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాల్లో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి : Tollywood : అబ్బబ్బో.. సీరియల్లో అమాయకంగా.. నెట్టింట పిచ్చెక్కించేలా.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో ఆడపులి.. యూత్‏కు తెగ నచ్చేస్తోన్న కంటెస్టెంట్..