అల్లు అర్జున్ టాలీవుడ్ షారుక్.. బన్నీని ఆకాశానికెత్తేసిన హాట్ బ్యూటీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్నారు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. పుష్ప, పుష్ప 2 సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సూపర్ హీరో కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

అల్లు అర్జున్ టాలీవుడ్ షారుక్.. బన్నీని ఆకాశానికెత్తేసిన హాట్ బ్యూటీ
Alluarjun

Updated on: Nov 09, 2025 | 8:06 AM

అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. పుష్ప సినిమా తర్వాత బన్నీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇటీవలే పుష్ప 2 సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్, పుష్ప 1 అలాగే పుష్ప 2 రెండు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు స్టార్ హీరో అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బన్నీ. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా గురించి మొన్నామధ్య ఓ అప్డేట్ వచ్చేసింది. సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని ముఖ్యంగా సూపర్ హీరోల కాన్సెప్ట్‌తో మూవీ ఉంటుందని ఓ వీడియో ద్వారా చెప్పకనే చెప్పారు మేకర్స్. దాంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అల్లు అర్జున్‌ పై ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఓ హీరోయిన్ అల్లు అర్జున్ ను టాలీవుడ్ షారుక్ ఖాన్ అంటూ ఆకాశానికెత్తేసింది.. ఆమె ఎవరో కాదు.. టాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్దాదాస్. ఈ అందాల భామ గురించి తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు 20 ఏళ్లుగా సినీరంగంలో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటివరకు సరైన బ్రేక్ అందుకోలేదు. అప్పుడప్పుడు అవకాశాలు వస్తున్నప్పటికీ సరైన స్టార్ డమ్ కోసం ఇంకా ఎదురుచూస్తుంది ఈ బ్యూటీ.

40 ఏళ్లకు చేరువలో ఉన్న ఈ వయ్యారి.. చెక్కు చెదరని గ్లామర్ సొగసులతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతున్నారు. దసరా ఫెస్టివల్ సందర్భంగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. చీరకట్టులోమరింత అందంగా కనిపిస్తూ కవ్విస్తుంది ఈ అమ్మడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాళీ భాషలలో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు కావొస్తున్నా ఇప్పటివరకూ ఈ బ్యూటీకి సరైన బ్రేక్ రాలేదు. తాజాగా ఈ అమ్మడు మాట్లాడుతూ.. ఆర్య 2 సినిమాలో అల్లు అర్జున్ తో కలిసి నటించింది శ్రద్దాదాస్. ఈ సినిమాలో ఆమె కనిపించేది కొంతసేపే అయినా తన అందంతో ఆకట్టుకుంటుంది. శ్రద్దా మాట్లాడుతూ.. అల్లు అర్జున్ కు తెలుగులోనే కాదు బాంబేలోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఆయనకు క్రేజ్ ఉంది.  అల్లు అర్జున్ టాలీవుడ్ షారుక్ ఖాన్ అంటూ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి