Saranya Ponvannan: ఈ నటి కూతుర్లను చూశారా.. ? అందంలో హీరోయిన్స్ సైతం దిగదుడుపే.. ఇద్దరూ ఏం చేస్తున్నారంటే..

తెలుగు సినిమా ప్రపంచంలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టి్స్టుగా తనదైన ముద్ర వేసిన తారలు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన భామలు.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయ్యారు. అందులో నటి శరణ్య ఒకరు. కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో కథానాయికగా నటించి మెప్పించింది. ఇప్పుడు స్టార్ హీరోహీరోయిన్లుగా తల్లిగా నటిస్తుంది.

Saranya Ponvannan: ఈ నటి కూతుర్లను చూశారా.. ? అందంలో హీరోయిన్స్ సైతం దిగదుడుపే.. ఇద్దరూ ఏం చేస్తున్నారంటే..
Saranya

Updated on: Oct 31, 2025 | 2:59 PM

దక్షిణాది సినీప్రియులకు నటి శరణ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా అలరించిన ఆమె.. ఇప్పుడు అత్త, అమ్మ పాత్రలు పోషిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయ్యారు. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన నాయకన్ సినిమాలో హీరోయిన్ గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో అమాయకమైన అమ్మాయిగా.. అందం, అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత తమిళంలో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఆమె.. ఆ తర్వాత సహాయ పాత్రలు పోషించింది. ఇప్పుడు తెలుగు, తమిళం భాషలలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది. తమిళ్ నటుడు, డైరెక్టర్ పొన్వన్నన్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఇవి కూడా చదవండి : Actress: 150కి పైగా సీరియల్స్.. ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలిసే భిక్షాటన చేస్తూ ..

పెళ్లి తర్వాత కూడా నటిగా కొనసాగుతున్నారు శరణ్య. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. మరోవైపు శరణ్య భర్త సైతం ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఇక శరణ్య కూతుర్లు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అందులో హీరోయిన్లను మించిపోయారు. అయినప్పటికీ యాక్టింగ్ రంగానికి దూరంగా ఉంటున్నారు. అయితే శరణ్య కూతర్లు చాందిని, ప్రియదర్శిని ఇద్దరూ పాపులర్ డాక్టర్స్ అని మీకు తెలుసా.. ? శరణ్య కూతురు చాందిని గైనకాలజిస్ట్ గా డాక్టర్ చదువు కంప్లీట్ చేసింది. ఇక మరో కూతురు ప్రియదర్శిని పీడియాట్రిక్స్‌లో ఎండీ పట్టభద్రురాలైంది.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి.. సినిమాలు వదిలేసి గూగుల్ కంపెనీ సీఈఓగా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?

తన కూతురు ప్రియదర్శిని గ్రాడ్యుయేషన్ డే కు సంబంధించిన వీడియోను శరణ్య తన ఇన్ స్టాలో షేర్ చేశారు. వైద్యురాలిగా తన చదువును పూర్తి చేసిన తన కుమార్తె ను చూసి గర్వంగా ఉందంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం శరణ్య షేర్ చేసిన వీడియో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి :  Actor : 26 అనాథాశ్రమాలు.. 46 ఉచిత పాఠశాలలు.. రియల్ లైఫ్ హీరో.. సమాజం కోసం జీవితం ఇచ్చిన హీరో..

ఇవి కూడా చదవండి : ఎన్నాళ్లకు కుదిరిందయ్యో.. అప్పుడు ప్రేయసిగా. ఇప్పుడు స్పెషల్ సాంగ్‏లో