Actress Sangeetha: తిరుమలలో సీనినటి సంగీత కుటుంబం.. కూతురిని చూశారా ఎంత క్యూట్‌గా ఉందో..
సంగీత ఫ్యామిలీ మెంబర్స్‌కు వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అలాగే వారికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. దర్శనానంతరం ఆలయం నుంచి బయటకు వస్తున్న సంగీత, ఆమె భర్త క్రిష్, కూతురిని ఫోటోగ్రాఫర్స్ కెమెరాల్లో బంధించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మొదటిసారి సంగీత కూతురు శివ్హియను చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. సంప్రదాయ దుస్తుల్లో ఎంతో సింపుల్‌గా కనిపిస్తుంది సంగీత కూతురు.
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సంగీత కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ విరామ సమయంలో భర్త క్రిష్, కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. సంగీత ఫ్యామిలీ మెంబర్స్‌కు వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అలాగే వారికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. దర్శనానంతరం ఆలయం నుంచి బయటకు వస్తున్న సంగీత, ఆమె భర్త క్రిష్, కూతురిని ఫోటోగ్రాఫర్స్ కెమెరాల్లో బంధించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మొదటిసారి సంగీత కూతురు శివ్హియను చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. సంప్రదాయ దుస్తుల్లో ఎంతో సింపుల్‌గా కనిపిస్తుంది సంగీత కూతురు. తండ్రితో కలిసి ప్రసాదం తింటూ కనిపించింది శివ్హియ.
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలోని బీజీ హీరోయిన్లలో సంగీత ఒకరు. అందం, అభినయంతో తెలుగువారికి దగ్గరయ్యింది. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది సంగీత. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో చాలా సినిమాల్లో నటించి అలరించింది సంగీతం. ముఖ్యంగా ఖడ్గం, పెళ్లాం ఊరేలితే సినిమాలతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఖడ్గం సినిమా తర్వాత సంగీతకు చాలా ఆఫర్స్ వచ్చాయి. తెలుగులో ఈ అబ్బాయి చాలా మంచోడు, ఆయుధం, ఓరి నీ ప్రేమ బంగారంగానూ, సంక్రాంతి చిత్రాల్లో నటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంగీత ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
View this post on Instagram
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ రష్మిక తల్లి పాత్రతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇక ఇటీవలే విజయ్ దళపతి నటించిన వారసుడు సినిమాలో మరోసారి శ్రీకాంత్ జోడిగా నటించి మెప్పించింది. సంగీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీ విషయాలు.. ఫోటోషూట్స్ షేర్ చేస్తుంటుంది.
View this post on Instagram
ఇక సంగీత ఫ్యామిలీ విషయానికి వస్తే.. సంగీత.. 2009లో తమిళ్ సింగర్ క్రిష్ ను వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి తిరువన్నమలైలోని అరుణాచలేశ్వర ఆలయంలో జరిగింది. వీరికి ఒక కూతురు జన్మించింది. కూతురుకు సంబంధించిన ఫోటోస్ సంగీత తన ఇన్ స్టాలో షేర్ చేస్తుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.