AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : కృష్ణవంశీ ఈ అమ్మాయిని హీరోయిన్‏గా తీసుకున్నాడు ఏంటీ అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీనే ఏలేసింది..

తెలుగులో కథానాయికగా తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అయితే కెరీర్ మొదట్లో మాత్రం చాలా అవమానాలు, సవాళ్లు ఎదుర్కొన్నారు. ఇటీవల పలు ఇంటర్వ్యూలలో తమకు ఎదురైనా చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి. డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాతో ఆమె లైఫ్ మారిపోయింది.

Tollywood : కృష్ణవంశీ ఈ అమ్మాయిని హీరోయిన్‏గా తీసుకున్నాడు ఏంటీ అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీనే ఏలేసింది..
Sangeetha
Rajitha Chanti
|

Updated on: Jun 05, 2026 | 8:40 AM

Share

తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి సంగీత. వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కీలకపాత్రలు పోషిస్తూ సహయ నటిగా రాణిస్తుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ టర్నింగ్ పాయింట్స్ , వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో తన ప్రయాణం ఒక గొప్ప అనుభవమని సంగీత తెలిపారు. కెరీర్ ప్రారంభంలో మొదటి రోజు షూటింగ్ సమయంలో తనకు ఎవరూ తెలియదని, మేకప్ మ్యాన్ తనకు సరిపడని విధంగా మేకప్ వేసి, జుట్టుకు ఎక్కువగా నూనె రాయడంతో అద్దంలో తన ముఖాన్ని చూసుకోవడానికే చాలా ఇబ్బంది పడ్డానని పంచుకున్నారు. అయితే దర్శకుడు మాత్రం స్క్రీన్‌పై ఆ లుక్ చాలా పర్‌ఫెక్ట్‌గా ఉందని ప్రశంసించారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా మరేదో కాదు.. ఖడ్గం.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..

ఖడ్గం సినిమా షూటింగ్ మొదటి రోజు తనకు ఎదురైన ఒక సరదా, విచిత్రమైన సంఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు. అప్పట్లో షూటింగ్ సెట్‌లో తనకు ఎవరూ తెలియదని, కనీసం కెమెరామెన్‌ను కూడా తాను కలవలేదని చెప్పారు. ఆ సమయంలో అక్కడి మేకప్ మ్యాన్ తనకు పూర్తిగా వింతగా, అస్తవ్యస్తంగా మేకప్ వేశారట. ముఖానికి పసుపు రంగు మేకప్ వేసి, జుట్టుకు విపరీతంగా నూనె రాసి నిగనిగలాడేలా చేశాడని సంగీత నవ్వుతూ చెప్పారు. ఆ లుక్ చూసి అద్దంలో తనను తాను చూసుకోవడానికే తీవ్రంగా సిగ్గుపడ్డానని, చాలా అసౌకర్యంగా ఫీలయ్యానని వివరించారు. “సాధారణంగా మేకప్ అనేది మన రూపాన్ని పెంచాలి (ప్లస్ అవ్వాలి), కానీ అక్కడ అంతా మైనస్ అవుతూ వచ్చింది” అని ఆమె నాటి పరిస్థితిని గుర్తుచేసుకున్నారు. అలాంటి మేకప్‌తో బయటకు రావడానికి మొహమాటపడుతున్న సమయంలో, దర్శకుడు కృష్ణవంశీ రూమ్‌లోకి వచ్చి ఆమెను చూశారట. రూమ్ డోర్ ఓపెన్ చేయగానే సంగీతను ఆ లుక్‌లో చూసిన కృష్ణవంశీ.. ఏమాత్రం అసంతృప్తి చెందకుండా, తనదైన శైలిలో “పర్ఫెక్ట్.. పర్ఫెక్ట్.. ఫెంటాస్టిక్.. అవుట్ ఆఫ్ ది వరల్డ్.. సూపర్!” అంటూ ఎంతో ఉత్సాహంగా మెచ్చుకున్నారని సంగీత చెప్పారు. ఆ పాత్రకు సరిగ్గా అదే లుక్ కావాలని ఆయన ముందే ప్లాన్ చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..

షూటింగ్ సమయంలో ఆ పాత్ర ప్రాధాన్యత తనకు అంతగా అర్థం కాలేదని, కానీ సినిమా పూర్తయ్యాక ప్రివ్యూ థియేటర్‌లో అవుట్‌పుట్ చూసినప్పుడు తనకు మైండ్ బ్లాక్ అయిందని సంగీత వెల్లడించారు. ఆ పాత్ర సమాజంపై, ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం (ఇంపాక్ట్) చూపిందో చూసి తాను ఆశ్చర్యపోయానని, అంతటి అద్భుతమైన పాత్రను తనకు ఇచ్చినందుకు దర్శకుడు కృష్ణవంశీకి ఎప్పటికీ ‘హాట్సాఫ్’ చెబుతానని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఈ చిత్రంలో సినిమా నటి కావాలని కలలుగనే ఒక అమాయకపు పల్లెటూరి అమ్మాయి ‘లక్కీ’ పాత్రలో సంగీత పండించిన హాస్యం, అమాయకత్వం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి.

ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో ‏డేట్‏కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..

సంగీత ఫోటో..

Sangeetha Movies

Sangeetha Movies

ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..

Follow Us
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు
ఆకాష్ దీప్ కోసం అంత త్యాగం చేసిన అమ్మాయి ఎవరంటే ?
ఆకాష్ దీప్ కోసం అంత త్యాగం చేసిన అమ్మాయి ఎవరంటే ?
పెళ్లయిన మూడు రోజులకే ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జస్వంత్.. ఏమైందంటే?
పెళ్లయిన మూడు రోజులకే ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జస్వంత్.. ఏమైందంటే?
అబ్బా సాయిరాం.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
అబ్బా సాయిరాం.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
మరికాసేపట్లో SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు.. లింక్
మరికాసేపట్లో SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు.. లింక్
జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?
జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?