గతేడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది నటి సమంత. అయితే ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. తనను బాగా ఇబ్బంది పెడుతోన్న మయోసైటిస్ ట్రీట్ మెంట్ కోసం విదేశాలకు వెళ్లొచ్చింది సమంత. ఆ తర్వాత సినిమా షూటింగుల్లో బిజీ అవుతుందని భావించారు. అయితే అదేమీ జరగలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ మాత్రమే ఉంది. అలాగే ఇటీవల తన పుట్టిన రోజున నిర్మాతగా ఒక సినిమాను కూడా అనౌన్స్ చేసింది. సినిమాలకు దూరంగా ఉన్న సామ్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. ఇదిలా ఉంటే తాజాగా ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టిందీ అందాల తార.ఇటీవల రిలీజైన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో సమంత అభిమాని మంచి ర్యాంకు సాధించింది. తన డైహార్డ్ ఫ్యాన్ అయిన అమ్మాయి ఎంసెట్ లో మంచి ర్యాంక్ సాధించడంతో తెగ ఖుషి అవుతోంది సమంత. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆ టాప్ ర్యాంకర్ కు అభినందనలు తెలిపిందీ ముద్దుగుమ్మ. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన డై హార్డ్ ఫ్యాన్ తో దిగిన ఫోటోను షేర్ చేసిన సమంత ‘ నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది లిటిల్ ఛాంపియన్’ అంటూ రాసుకొచ్చింది.
ప్రస్తుతం సామ్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంసెట్ ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించిన అభిమానిని గుర్తు చేసుకుని మరీ అభినందించిన ఈ అందాల తారపై ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. కాగా ఇటీవల సమంత మార్ఫింగ్ బారిన పడింది. దీనిని నిజమనుకుని చాలా మంది సామ్ ను ట్రోలింగ్ చేశారు. తీరా అది ఓ నెటిజన్ చేసిన చిల్లర పని అని తెలిసింది. కాగా ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ప్రకటించింది సమంత. అలాగే పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.ఇక వరుణ్ ధావన్‌తో సమంత నటించిన ‘హనీ బాని’ వెబ్ సిరీస్ కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.