Sai Pallavi: బాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇవ్వనున్న న్యాచురల్ బ్యూటీ.. రణబీర్ కపూర్‏కు జోడిగా సాయి పల్లవి..

|

Dec 06, 2022 | 10:23 AM

తెలుగుతోపాటు.. తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. చివరిగా గార్గి సినిమాతో ప్రశంసలు అందుకున్న సాయి పల్లవి గురించి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

Sai Pallavi: బాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇవ్వనున్న న్యాచురల్ బ్యూటీ.. రణబీర్ కపూర్‏కు జోడిగా సాయి పల్లవి..
Sai Pallavi
Follow us on

అందం, సహజనటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు దొచుకుంది హీరోయిన్ సాయి పల్లవి. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఎంసీఏ, పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం చిత్రాల్లో కనిపించి తన నటనతో ఆకట్టుకుంది. తెలుగుతోపాటు.. తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. చివరిగా గార్గి సినిమాతో ప్రశంసలు అందుకున్న సాయి పల్లవి గురించి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. తన చెల్లెలు పూజా కన్నన్ తో కలిసి సాయి పల్లవి హస్పిటల్ నిర్మిస్తుందని.. సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి వైద్యురాలిగా సెటిల్ కాబోతుందంటూ వార్తలు వినిపించాయి. వీటిపై ఇప్పటివరకు సాయి పల్లవి కానీ.. ఆమె కుటుంబం కానీ స్పందించలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఈ న్యాచురల్ బ్యూటీ ఫిల్మ్ కెరీర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.

ఇప్పటివరకు దక్షిణాది చిత్రాల్లోనే కనిపించిన సాయి పల్లవి ఇకపై బాలీవుడ్ అరంగేట్రం చేయనుందట. స్టార్ హీరో రణబీర్ కపూర్ రాబోయే చిత్రంలో ఆయనకు జోడీగా సాయి పల్లవి నటించనుందని టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది వీరి కాంబోలో రాబోయే చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం. ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కించనున్నారని.. అందులో సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనుందని టాక్. ఇక రాముడిగా రణబీర్ కపూర్ నటించనున్నారట. ఇంతకు ముందు సీత పాత్ర కోసం దీపికా పదుకొణె, కరీనా కపూర్ ల పేర్లు పరిశీలిస్తున్నారని.. ఫైనల్ గా సాయి పల్లవిని ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఇక ముందు శ్రీరాముడిగా హృతిక్ అనుకోగా.. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ రణబీర్ చేతిలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో హృతిక్ రాముడిగా కాకుండా రావణుడి పాత్రలో కనిపించనున్నాడట. ఇక సాయి పల్లవి, రణబీర్ కపూర్ జోడీ చూసేందుకు నార్త్ ఆడియన్స్ సైతం తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరోవైపు రామాయణం సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది సాయి పల్లవి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.