Sai Pallavi: పవన్ కళ్యాణ్ ఆ సినిమా చేయడానికి కారణమదే.. ఆసక్తికర విషయాలు చెప్పిన సాయి పల్లవి..

|

Jul 13, 2022 | 3:59 PM

ప్రస్తుతం ఈ న్యాచురల్ బ్యూటీ తన తదుపరి చిత్రం గార్గి ప్రమోషన్లలో బిజీగా ఉంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమాను

Sai Pallavi: పవన్ కళ్యాణ్ ఆ సినిమా చేయడానికి కారణమదే.. ఆసక్తికర విషయాలు చెప్పిన సాయి పల్లవి..
Sai Pallavi
Follow us on

ఇటీవలే విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi). ఇందులో వెన్నెల పాత్రలో ఆమె ఒదిగిపోయింది. సహజమైన నటనతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ న్యాచురల్ బ్యూటీ తన తదుపరి చిత్రం గార్గి ప్రమోషన్లలో బిజీగా ఉంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమాను జూలై 15న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే గార్గి మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సాయి పల్లవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.

గార్గి సినిమా ప్రమోషన్లలో భాగంగా పవర్ స్టార్ గురించి మాట్లాడుతూ.. ఆయన వకీల్ సాబ్ చిత్రాన్ని కేవలం జనాల కోసమే చేశారని.. ఆయనలాంటి స్ట్రేచర్, స్థాయి ఉన్న వ్యక్తులు అలాంటి సినిమాలు తీస్తే, మెసెజ్ చెబితే అందరూ వింటారని.. అందుకే అలాంటి సినిమాలు చేశారని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. లేడీ ఓరియెంటెడ్ గా వచ్చిన ఈ మూవీలో సాయి పల్లవి స్కూల్ టీచర్ పాత్రలో నటించింది. ఈ సినిమా కేవలం మెసెజ్ ఓరియెంటెడ్ కాదని.. కానీ సినిమాను రెండున్నర గంటలు చూసి అక్కడే వదిలేయలేయకుండా వెంట తీసుకెళ్తారని తెలిపింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.