Sadha: సినిమా చూస్తూ ఏడ్చేసిన స్టార్ హీరోయిన్.. ఇంతకు ఎందుకు కన్నీళ్లు పెట్టుకుందంటే

జయం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సొగసరి భామ సదా(Sadha). ఆ సినిమా తర్వాత ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకుపోయింది.

Sadha: సినిమా చూస్తూ ఏడ్చేసిన స్టార్ హీరోయిన్.. ఇంతకు ఎందుకు కన్నీళ్లు పెట్టుకుందంటే
Sadha
Follow us

|

Updated on: Jun 18, 2022 | 4:49 PM

జయం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సొగసరి భామ సదా(Sadha). ఆ సినిమా తర్వాత ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకుపోయింది. తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసి అలరించింది ఈ అందాల భామ. ఇటీవల కాలంలో సదా సినిమాలు తగ్గించారు. పలు టీవీ షోలకు గెస్ట్ గా వ్యవహరిస్తున్నారు సదా.  తాజాగా సదా కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది థియేటర్ లో సినిమా చూస్తూ ఏడ్చేసింది సదా. అసలు విషయం ఏంటంటే

మేజర్ సందీప్‌ ఉన్ని కృష్ణణ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ సినిమా ఇప్పటికీ సక్సెఫుల్ గా రన్‌ అవుతోంది. రిలీజైన మొదటి రోజే భావోద్వేగాల మేజర్ అని పేరు తెచుకున్న ఈ సినిమా.. ఇప్పటికే చూసిన వారందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. దేశం కోసం మేజర్ సందీప్‌ చేసిన ప్రాణ త్యాగాన్ని కొనియాడేలా చేస్తోంది. యువతకైతే ఆర్మీలో చేరాలనే ఆలోచనను రేకెత్తిస్తోంది.ఇక ఇప్పటికే ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీలు మేజర్ సినిమాకు చూసి ఎమోషనల్ అవుతున్న క్రమంలో.. హీరోయిన్ సదా కూడా తాజాగా ఈ సినిమాను చూశారు. చూడడమే కాదు.. మేజర్ సినిమా చూస్తూ.. ఏడ్చేశారు. ఇక ఈ సీన్‌ను వీడియో తీసిన మేజర్ టీం.. ఆ వీడియోను తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిలింగ్స్లో పంచుకుంది. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Major (@majorthefilm)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి