
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తక్కువ సమయంలోనే అగ్ర హీరోలతో జోడీగా నటించింది. ఇక ఇప్పుడు రీఎంట్రీలోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. మరోవైపు ఆమె కూతురు సైతం హీరోయిన్ గా రాణిస్తుంది. తాజాగా తెలుగులో క్రేజీ ఛాన్స్ అందుకున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరో తెలుసా.. ? బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కూతురు రాషా తడాని. ప్రస్తుతం బీటౌన్ లో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఇప్పటివరకు అటు గాయనిగా, ఇటు కథానాయికగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది. ఇటీవలే అజాద్ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో ఆమె చేసిన ఒక్క స్పెషల్ సాంగ్ ఏ రేంజ్ లో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు.
ఇవి కూడా చదవండి : Actress : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. రూ.2000 కోట్ల ఆస్తులు.. ఎవరంటే..
అందులో ఆమె డ్యాన్స్ మూమెంట్స్, ఎక్స్ ప్రెషన్స్ కట్టిపడేశాయి. దీంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఘట్టమనేని వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ త్వరలోనే హీరోగా అరంగేట్రం చేయనున్నారు. ఇక జయకృష్ణ జోడిగా రషా తడాని నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తుండగా.. లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.
ఇవి కూడా చదవండి : Cinema : 26 రోజుల్లోనే 280 కోట్ల కలెక్షన్స్.. రికార్డ్ సృష్టించిన తొలి యానిమేటెడ్ సినిమా ఇది..
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 15న నుంచి స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఈ సినిమాతోనే రాషా తడాని తెలుగులోకి అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో రాషా పేరు మారుమోగుతుంది.
ఇవి కూడా చదవండి : Cinema : రెండు గంటల సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. దెబ్బకు దద్దరిల్లిన బాక్సాఫీస్.. ఎక్కడ చూడొచ్చంటే..
Cinema: రూ.70 లక్షల బడ్జెట్.. 70 కోట్ల కలెక్షన్స్.. 460 రోజులు థియేటర్లలో రచ్చ చేసిన సినిమా..