Rashmika Mandanna: ఆ స్టార్‌ హీరో చేసిన పనికి ఏడుపొచ్చింది.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

|

Oct 02, 2022 | 1:25 PM

బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌తో కలిసి రష్మిక నటిస్తోన్న గుడ్‌ బై చిత్రం అక్టోబర్‌ 7న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజిగా ఉంటోందీ అందాల తార.

Rashmika Mandanna: ఆ స్టార్‌ హీరో చేసిన పనికి ఏడుపొచ్చింది.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rashmika Mandanna
Follow us on

పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్రతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ తెచ్చుకుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. నేషనల్‌ క్రష్‌ అన్న పేరుకు తగ్గట్లే తన క్యూట్‌ ఎక్స్‌ ప్రెషన్స్‌తో నేషనల్‌ వైడ్‌గా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. అందుకే ఇప్పుడు దక్షిణాదితో పాటు హిందీలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌తో కలిసి రష్మిక నటిస్తోన్న గుడ్‌ బై చిత్రం అక్టోబర్‌ 7న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజిగా ఉంటోందీ అందాల తార. ఈక్రమంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో హిందీ చిత్ర పరిశ్రమ, స్టార్‌ హీరోల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

బ్రేక్‌పాస్ట్‌ నచ్చకపోవడంతో..

కాగా ప్రస్తుతం రష్మిక నటిస్తోన్న హిందీ సినిమాల్లో యానిమల్‌ కూడా ఒకటి. చాక్లెట్ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు అర్జున్‌ రెడ్డి ఫేం వంగా సందీప్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. గుడ్‌ బై ప్రమోషన్లలో పాల్గొన్న రష్మిక రణ్‌బీర్‌పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేసింది. ‘యానిమల్ సినిమా కోసం షూటింగ్ జరుగుతున్నప్పుడు.. బ్రేక్‌ఫాస్ట్ నాకు నచ్చలేదు. ఇదే విషయాన్ని చిత్ర బృందానికి చెప్పాను. దీంతో మరుసటి రోజు ఉదయం రణ్‌బీర్ నా కోసం రుచికరమైన అల్పాహారం తీసుకొచ్చాడు. తన చెఫ్‌తో ప్రత్యేకంగా తయారుచేయించి మరీ నాకోసం తీసుకొచ్చాడు. అది చూసి నేను ఏడవడం మొదలు పెట్టాను. ఆయన తెచ్చిన ఫుడ్ చాలా బాగుందని చెప్పి బాగా ఏడ్చేశాను’ అని చెప్పుకొచ్చింది రష్మిక.

ఇక సినిమాల విషయానికొస్తే.. గుడ్‌బై, యానిమల్‌తో పాటు మిషన్ మజ్ను అనే హిందీ సినిమాలో కూడా నటిస్తోంది రష్మిక. సిద్ధార్థ్ మల్హోత్రా హీరో. ఇదే కాకుండా రోహిత్ ధావన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న రాంబో రీమేక్‌లో కూడా ఈ ముద్దుగుమ్మనే హీరోయిన్‌గా ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇక తెలుగులో పుష్ప సీక్వెల్‌ పుష్ప.. దిరూల్‌ లోనూ నటిస్తోంది. అలాగే వారసుడు సినిమాలో కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్‌ తో కలిసి స్ర్కీన్‌షేర్‌ చేసుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..