Actress Rambha: రీ ఎంట్రీకి రెడీ అయిన క్రేజీ బ్యూటీ రంభ.. ఆనందంలో అభిమానులు
ఇప్పటికే చాలా మంది సీనియర్ బ్యూటీలు ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించిన వారు కూడా ఇప్పుడు చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా రీఎంట్రీ ఇవ్వనుంది. ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను ఊపేసిన నటీమణుల్లో రంభ ఒకరు.

90వ దశకంలో హీరోయిన్ రంభ పేరు ఎక్కువగా మార్మోగిపోయింది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ ఇలా అన్ని భాషల్లో రంభ తన ముద్ర వేశారు. నటిగా రంభ కెరీర్‌లో మరుపురాని క్లాసిక్ చిత్రాలెన్నో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా రంభ ఈ సినీ పరిశ్రమకు, నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం రంభ రీ ఎంట్రీకి సిద్దంగా ఉన్నారు.
ఆ ఒక్కటి అడక్కు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మడు. అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, బావగారూ బాగున్నారా, బొంబాయి ప్రియుడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది ఈ అమ్మడు. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ స్టెప్పులేసి అదరగొట్టింది. దేశముదురు, యమదొంగ, నాగ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో రంభ నటించింది.
రంభ గ్లామర్, నటన, ఆమె గ్రేస్ ఫుల్ స్టెప్పులకు అప్పటి ఆడియెన్స్ ఫిదా అయ్యేవారు. రంభ తన రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ‘నా ఫస్ట్ ఛాయిస్ ఎప్పుడూ సినిమానే. ఇక ఇప్పుడు ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు అయినా నేను సంసిద్దంగా ఉన్నాను. ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. కొత్త పాత్రలను ఎంచుకుని, మళ్లీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వాలని ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు. ఇక అభిమానులు, ప్రేక్షకులు ఆమె రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి రంభ రీ ఎంట్రీ ఎలా ఉంటుందో.. ఎలాంటి చిత్రాలతో ఆడియెన్స్ ముందుకు వస్తుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
