
టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అంటే ఠక్కున గురొచ్చే పేరు పూరి జగన్నాథ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. 2006లో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాతో బాక్సాఫఈస్ వద్ద సంచలనం సృష్టించారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించి.. హీరోయిజం అంటే సరికొత్త అర్థం చెప్పారు. పూరి సినిమాలకు యూత్ లో మంచి క్రేజ్ ఉంటుంది. పూరి జగన్నాథ్ సినిమాల కోసం అభిమానులు, యూత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి టాప్ డైరెక్టర్ సినిమాలో అవకాశం వస్తే నటించాలని ఎంతో మంది ఆర్టిస్టుల కల. కానీ ఓ హీరోయిన్ మాత్రం పూరి జగన్నాథ్ సినిమా నుంచి ఆఫర్ రిజెక్ట్ చేసిందట. మోడలింగ్ రోజుల్లో ఇండస్ట్రీ గురించి ఏమి తెలియదని.. అప్పుడే పూరి జగన్నాథ్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని కానీ ఆ ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.
తెలుగు చిత్రపరిశ్రమలో ఒకప్పుడు టామ్ హీరోయిన్ ఆమె. స్టార్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత సైతం కెరీర్ లో రాణిస్తుంది రకుల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్.. కెరీర్ ఆరంభం, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే మోడలింగ్ చేశానని.. ఆ సమయంలో తన ఫోటోస్ చూసి కన్నడ సినిమా నుంచి ఆఫర్ వచ్చిందని.. అప్పట్లో తనకు సౌత్ ఇండస్ట్రీ గురించి అంతగా తెలియదని చెప్పుకొచ్చింది. ఆ సినిమా వాళ్లు తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడటంతో గిల్లి సినిమాలో నటించానని.. సినిమా షూటింగ్ వల్ల చదువులో సమస్యలు వచ్చాయని.. ఫస్ట్ మూవీతోనే నటనకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత తనకు పూరి జగన్నాథ్ నుంచి కాల్ వచ్చిందని.. దాదాపు 70 రోజులు డేట్స్ అడిగారని.. అందుకు తాను అంగీకరించలేదని తెలిపింది. కాలేజీ ఉందని.. కావాలంటే నాలుగు రోజులు ఇస్తానని చెప్పిందట. సినిమాల్లో ఎన్ని రోజులు వర్క్ ఉంటుందనేది తనకు అప్పట్లో తెలియదని.. ఆయన తన ఇబ్బందిని అర్థం చేసుకున్నారని తెలిపింది. ఆ సమయంలో ఎన్నో ఆఫర్స్ వదులుకున్నట్లు చెప్పుకొచ్చింది.
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..