టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. కొండపొలం సినిమాతో చివరిసారిగా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ అమ్మడు.. హిందీలో మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే డాక్టరీ జీ మూవీతో థియేటర్లలో సందడి చేసిన రకుల్.. ప్రస్తుతం థాంక్స్ గాడ్ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తుంది. అక్టోబర్ 25న విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తుంది. ఫాంటసీ సోషల్ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీలో రకుల్ కథానాయికగా కాగా.. అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హాత్రా ప్రధాన పాత్రలలో నటించారు. ముఖ్యంగా ఈ మూవీలో ఆమె నటనకు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ క్రమంలో తన తల్లిదండ్రులు కూడా ఈ సినిమాపై స్పందించారని.. రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి సినిమా గురించి మాట్లాడారని.. తన వద్ద నుంచి వాళ్ల నాన్న ఏకంగా డైరెక్టర్ నంబర్ తీసుకున్నారంటూ చెప్పుకొచ్చింది.
రకుల్ మాట్లాడుతూ..” నేను నటించిన లేటేస్ట్ సినిమా థ్యాంక్ గాడ్ ను మా అమ్మానాన్న చూశారు. మా నాన్న రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి ఇప్పటివరకు నువ్వు చేసిన సినిమాల్లో ఇది ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుంది. నేటి తరం వాళ్లందరూ ఈ సినిమాను ఇష్టపడతారు. ఎందుకంటే ఇది మన భారతీయ కుటుంబాలకు.. సంస్కృతికి చాలా దగ్గరగా ఉంది. అని అన్నారు. నా నుంచి డైరెక్టర్ నంబర్ తీసుకుని ఇంత మంచి సినిమాను అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ” అంటూ రకుల్ చెప్పుకొచ్చింది.
అయితే ఈ సినిమా విడుదలకు ముందు పలు అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. థ్యాంక్ గాడ్ చిత్రం కొందరి మనోభావాలను దెబ్బతీసిందనే ఆరోపణలను వెలువడ్డాయి. డైరెక్టర్ ఇంద్ర కుమార్ పై యూపీలో ఫిర్యాదు చేశారు. ఈ చిత్రంలో మరణానంతరం ప్రతి ఒక్కరి పాపాలను లెక్కించే లార్ట్ చిత్రగుప్తుడు ధరించిన దుస్తులు ఆధునికంగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం పై రకుల్ స్పందిస్తూ.. సినిమా ప్రేక్షకులను బాధపెడితే అభ్యంతరం తెలిపే హక్కు వారికి ఉంటుందని అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.