
స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి సినిమాతో ప్రియాంక చోప్రా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా ప్రియాంక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఆమె ఇప్పుడు హాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. ప్రియాంక చోప్రా స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేశారు. బాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ డమ్ సొంతం చేసుకుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ప్రియాంక, నిక్ ఎంతో అన్యున్యంగా ఉంటారు. ఈ ఇద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. ఈ ఇద్దరూ రెగ్యులర్ గా తమ ఫోటోలను, ఫ్యామిలీతో గడిపే ఆనంద క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే కొన్ని నెలలుగా ప్రియాంక, నిక్ విడిపోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్స్ పై తాజాగా ప్రియాంక స్పదించింది. నేను, నిక్ ఎంతో సంతోషంగా జీవితంలో ముందుకు వెళ్తున్నాం.. బయట జరిగే విషయాలను పెద్దగా పట్టించుకోము.. అయితే కొన్ని రోజులుగా నేను, నా భర్త విడిపోతున్నాం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
మా వివాహబంధం ముగిసిపోవాలని.. మేము విడిపోవాలని కోరుకుంటున్నారా.? తరచుగా ఇలాంటి రూమర్స్ ఎందుకు వైరల్ చేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. మేము ఇద్దరం రెండు వేరువేరు దేశాలకు చెందడంతో పాటు మా మతాలు కూడా వేరు. అంతే కాదు మా మధ్యలోనూ వయసు తేడా ఉంది.. ఇవన్నీ ఎవరైనా ఇబ్బందిపెట్టి ఉండొచ్చు. మేము ఎనిమిదేళ్లుగా చాలా సంతోషంగా ఉన్నాం.. నిక్ పరిచయమైన తర్వాత ఆరు నెలల్లోనే పెళ్లి చేసుకున్నాం. నిక్ ను కలిసిన తర్వాత నాకు సరైన జోడీ అనిపించింది అందుకే పెళ్లి చేసుకున్నా.. మేము ఎవ్వరి గురించి పట్టించుకోము. మేము చాలా సంతోషంగా ఉన్నాం అంటూ ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.