Pragathi: నటి ప్రగతి కూతురిని చూశారా.. ? అందంలో హీరోయిన్స్ సైతం దిగదుడుపే..

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రగతి గురించి చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో తనదైన నటనతో సహయ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. చాలా మందిలాగే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ప్రగతి.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయ్యింది. ఇప్పుడు పవర్ లిఫ్టింగ్ లో నాలుగు పతకాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Pragathi: నటి ప్రగతి కూతురిని చూశారా.. ? అందంలో హీరోయిన్స్ సైతం దిగదుడుపే..
Pragathi

Updated on: Dec 14, 2025 | 1:49 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో సహాయ నటిగా తనదైన ముద్ర వేసింది నటి ప్రగతి. తెలుగులో అత్త, అక్క, వదిన పాత్రలలో కనిపించి సహజ నటనతో కట్టిపడేసింది. ఇక ఇప్పుడు తన ప్రతిభతోపాటు పట్టుదలతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కరోనా తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిన ప్రగతి.. రీల్స్ ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఓవైపు నటిగా మెప్పించినా ఆమె.. ఇటీవలే ఆసియా లెవెల్ పతకాలు అందుకుంది. పవర్ లిఫ్టింగ్ పై ఘనమైన పట్టు సాధించిన ప్రగతి.. ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వరుసగా పతకాలు గెలుచుకుంటూ 50 ఏళ్ల వయసులో యువతకు స్పూర్తిగా నిలిచింది.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : సుమన్ శెట్టి ప్రభంజనం.. బిగ్‏బాస్ హిస్టరీలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్.. 14 వారాలకు ఎంత సంపాదించాడంటే..

ఇవి కూడా చదవండి

తాజాగా టర్కీలో జరిగిన Asian Open & Masters Powerlifting Championship 2025లో పాల్గొన్న ఆమె నాలుగు పతకాలు సాధించింది. దీంతో ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. మరోవైపు నటి ప్రగతి గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన జిమ్ వీడియోస్, వర్కవుట్స్ ఫోటోస్ సైతం ఇప్పుడు తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలో నటి ప్రగతి కూతురు సైతం ఇప్పుడు నెట్టింట టాక్ ఆఫ్ టౌన్ అయ్యింది.

ఇవి కూడా చదవండి : 11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తెలుగులో తోపు హీరోయిన్..సైన్యంలో పనిచేసి ఉరి దాడిలో మరణించిన తండ్రి..

నటి ప్రగతి కూతురు పేరు గీత. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది నటి ప్రగతి. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలను తనే చూసుకుంటుంది. ప్రస్తుతం నటి ప్రగతి కూతురు గీత ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఆమె అందంలో అచ్చం అమ్మలాగే ఉంది.. ఇప్పుడు చదువుపై దృష్టి పెట్టిన గీత.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.

ఇవి కూడా చదవండి : Actress : కమిట్‌మెంట్ ఇవ్వలేదని 30 సినిమాల్లో నుంచి తీసేశారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

ఇవి కూడా చదవండి :  Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..