
తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న అగ్రకథానాయికలలో పూజా హెగ్డే ఒకరు. గతేడాది ఈ ముద్దుగుమ్మ వరుస ప్లాపులను ఖాతాలో వేసుకుంది. అయినా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. వరుస ఆఫర్లు అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. అటు తెలుగులోనే కాకుండా.. ఇటు హిందీలోనూ అవకాశాలు అందుకుంటుంది పూజా హెగ్డే. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలతో అలరించిన పూజా ప్రస్తుతం మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న ఎస్ఎస్ఎంబీ 28 చిత్రంలో నటిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇప్పటివరకు తాను నటించిన అన్ని చిత్రాలకంటే ఓ సినిమా ఎప్పటికీ తన హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందట. అంతేకాదు.. అందులో తాను నటించిన అమూల్య పాత్ర పుట్టి మూడేళ్లు అవుతుందంటూ మరోసారి ఈ సినిమాను గుర్తుచేసుకుంటూ ఓ వీడియోను షేర్ చేసింది పూజా. ఆ సినిమా ఏంటంటే.. వన్ ఆఫ్ ది సూపర్ హిట్ మూవీ అల వైకుంఠపురంలో..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా జనవరి 12న 2020లో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఇందులో పూజా హెగ్డే అమూల్య పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయి మూడేళ్లు అవుతున్న సందర్భంగా.. తన ట్విట్టర్ వేదికగా అల వైకుంఠపురంలోని బుట్టబొమ్మ సాంగ్ షేర్ చేస్తూ… ఆసక్తికర నోట్ రాసుకొచ్చింది.
“అమూల్య అనే పాత్ర పుట్టి మూడేళ్లు పూర్తయ్యింది. ఈ సినిమా నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. అల వైకుంఠపురంలో చిత్రం వచ్చి మూడేళ్లు అవుతుంది ” అంటూ బుట్టబొమ్మ సాంగ్ వీడియోను షేర్ చేసింది. పూజా ట్వీట్ కు నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. మరోసారి మీ ఇద్దరి జోడిని తెరపై చూడాలనుకుంటున్నట్లు్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా హిందీలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రంలో నటిస్తుంది.
Three years ago today was born a character named ‘Amulya’ and this movie does hold a special place in my heart. Here’s to celebrating #3YearsOfAlaVaikunthapurramuloo ?@alluarjun @MusicThaman @NavinNooli @GeethaArts @adityamusic @Nivetha_Tweets @pnavdeep26 @iamSushanthA pic.twitter.com/2qQqdYn40t
— Pooja Hegde (@hegdepooja) January 12, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.