Pooja Hegde: మోనికాతో హిట్టుకొట్టిన వదలని బ్యాడ్ లక్.. ఆ ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్డే అవుట్..

సౌత్ ఇండస్ట్రీలో ఇన్నాళ్లు టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పింది పూజా హెగ్డే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. కానీ కొన్నాళ్లుగా ఈ ముద్దుగుమ్మ సరైన ఆఫర్ కోసం ఎదురుచూస్తుంది. వరుస ప్లాపులతో నిరాశతో ఉన్న ఈ అమ్మడు... ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.

Pooja Hegde: మోనికాతో హిట్టుకొట్టిన వదలని బ్యాడ్ లక్.. ఆ ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్డే అవుట్..
Pooja Hegde (6)

Updated on: Aug 24, 2025 | 2:23 PM

హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం భాషలలో అగ్ర హీరోలందరితో కలిసి నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. తక్కువ సమయంలోనే వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మాత్రం సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ అమ్మడు.. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైంది. కెరీర్ మొదట్లో ప్లాపులే అందకున్నప్పటికీ అందం, అభినయంతో మెస్మరైజ్ చేసింది. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అలా వైకుంఠపురంలో వంటి చిత్రాలతో వరుసగా హిట్లు అందుకుంది. అయితే వరుస హిట్లే కాదు.. ఆ తర్వాత వచ్చిన ప్లాపులు అమ్మాడి కెరీర్ ను అయోమయంలో పడేశాయి. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలు డిజాస్టర్స్ కావడంతో పూజా సైలెంట్ అయ్యింది.

Cinema: రూ.70 లక్షల బడ్జెట్.. 70 కోట్ల కలెక్షన్స్.. 460 రోజులు థియేటర్లలో రచ్చ చేసిన సినిమా..

కొన్నాళ్లుగా తెలుగు, తమిళంలో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ షిప్ట్ అయ్యింది. అక్కడ కూడా ప్లాపులే ఎదురుకావడంతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇక ఇటీవలే రెట్రో మూవీతో సౌత్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సైతం నిరాశపరచడంతో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. ఇటీవలే రజినీకాంత్ నటించిన కూలీ చిత్రంలో అదరగొట్టింది. ఇందులో మోనికా అంటూ స్పెషల్ పాటలో స్టెప్పులతో ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్ తెగ ట్రెండ్ కావడంతో మళ్లీ పూజా ఫాంలోకి వచ్చిందని అనుకున్నారు. కానీ అలాంటిదేమి జరగలేదు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Cinema : రెండు గంటల సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. దెబ్బకు దద్దరిల్లిన బాక్సాఫీస్.. ఎక్కడ చూడొచ్చంటే..

తాజాగా ఈ అమ్మడు మరో ప్రాజెక్ట్ ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఆ సినిమా సైతం తప్పుకుందట. దుల్కర్ సల్మాన్ హీరోగా రవి నేలకుడితి అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఈ బ్యూటీని ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం పూజా ఈ ప్రాజెక్టులో నటించడం లేదట. దీంతో తెలుగులో తిరిగి సత్తా చాటాలనుకున్న పూజా ఆశలు ఆవిరైనట్లే అంటున్నారు.

ఇవి కూడా చదవండి : Cinema : 26 రోజుల్లోనే 280 కోట్ల కలెక్షన్స్.. రికార్డ్ సృష్టించిన తొలి యానిమేటెడ్ సినిమా ఇది..

ఇవి కూడా చదవండి : Actress : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. రూ.2000 కోట్ల ఆస్తులు.. ఎవరంటే..