Monica Song: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ‘మోనికా’.. ఈ స్పెషల్ సాంగ్ కోసం పూజ పాప ఎన్ని కోట్లు తీసుకుందంటే?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం కూలీ. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ రాజ్ తెరకెక్కిస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. మోనికా అంటూ సాగే పాట ఇటీవల విడుదలై దుమ్మురేపుతుంది.

కొన్ని నెలల క్రితం వరకు స్టార్ హీరోయిన్ గా వెలిగిన పూజా హెగ్డే ఈ మధ్యన వరుసగా పరాజయాలు ఎదుర్కొంది. ఆమె చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్య సినిమా రెట్రో కూడా పూజా పాపకు నిరాశనే మిగిల్చింది. దీంతో ఈ బుట్ట బొమ్మ బాగా డీలా పడిపోయింది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది పూజా పాప. ఆమె చేసిన స్పెషల్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. యూట్యూబ్ తో పాటు అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ట్రెండ్ అవుతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న కూలీ చిత్రంలో పూజ స్పెషల్ సాంగ్ చేసింది. మోనికా అంటూ సాగే ఈ పాటను ఇటీవలే రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో పూజతో పాటు మలయాళ నటుడు సౌబిన్ సాహిర్ కూడా తన గ్రేస్ ఫుల్ డ్యాన్స్ తో అదరగొట్టాడు. పోర్ట్ ఏరియాలో, గ్రూప్ డాన్స్ గా సాగే ఈ సాంగ్ ఆడియెన్స్ ను కట్టిపడేస్తుంది. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ ని ఉర్రూత లూగిస్తోంది.
ఈ నేపథ్యంలో మోనికా సాంగ్ కోసం పూజా హెగ్డే తీసుకున్న పారితోషికంపై సోషల్ మీడియాలో ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేవలం ఈ ఒక్క పాట కోసమే బుట్ట బొమ్మ సుమారు మూడు కోట్లు తీసుకుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. సాధారణంగా హీరోయిన్‌గా ఒక్కో సినిమాకు నాలుగైదు కోట్లు తీసుకుంటుంది పూజా. అయితే ఇందులో ఒక్క పాటకే పూజ ఏకంగా మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని తెలుస్తోంది.
దుమ్మురేపుతోన్న మోనికా సాంగ్..
Non-stop #Monica mania in Tamil, Telugu & Hindi❤️🔥 Watch the second single #Monica from #Coolie starring @hegdepooja 💃🏻
Tamil ▶️ https://t.co/UHACTjGi6I
Telugu ▶️ https://t.co/fDFDsYuaxQ
Hindi ▶️ https://t.co/Ll2QSJWzOV#Coolie worldwide from August 14th @rajinikanth… pic.twitter.com/0h58mIsha8
— Sun Pictures (@sunpictures) July 14, 2025
కూలీ సినిమాలో రజనీతో పాటు అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్, శ్రుతి హాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
#Monica wave is unstoppable 😍 Join the #Monica fever 💃🏻🥳
Tamil 🎵 https://t.co/xSRwic5BdH
Telugu 🎵 https://t.co/TGOgexS14H
Hindi 🎵 https://t.co/GhVGBkEu6R
The second single #Monica from #Coolie starring @hegdepooja#Coolie worldwide from August 14th @rajinikanth… pic.twitter.com/BOJiFONgl2
— Sun Pictures (@sunpictures) July 14, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








