Tollywood: పెళ్లై పదేళ్లు.. అమ్మా అని పిలిపించుకోవాలని ఉందంటోన్న టాలీవుడ్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
ఒక బిడ్డకు జన్మనిచ్చి అమ్మా అని పిలిపించుకున్నప్పుడే ఒక మహిళ జీవితం పరిపూర్ణం అవుతుందంటారు. అందుకే పెళ్లయిన అమ్మాయిలందరూ అమ్మతనం కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. అదే సమయంలో సంతానం కలగకపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఈ టాలీవుడ్ హీరోయిన్ ది కూడా అదే పరిస్థితి.

పై ఫొటోలో ఉన్న దెవరో గుర్తు పట్టారా? ఆమె ఒక ప్రముఖ హీరోయిన్. గతంలో తెలుగుతో పాటు పలు దక్షిణాది భాష సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా మలయాళంలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూ కేవలం కథా బలమున్న సినిమాల్లో నటించింది. అదే ఆమెకు ప్రత్యేక గుర్తింపు నిచ్చింది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుందీ అందాల తార. తన చిరకాల మిత్రుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలు కూడా తగ్గించేసింది. అయితే పెళ్లై పదేళ్లవుతున్నా ఈ దంపతులకు పిల్లలు లేరు. దీంతో అమ్మా అనే పిలుపు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండి. ఆమె మరెవరో కాదు శీను వాసంతి లక్ష్మి సినిమాలో నటించిన పద్మ ప్రియ. అలాగే శర్వానంద్ ఫీల్ గుడ్ మూవీ అందరి బంధువయ సినిమాలో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. చివరిగా జగపతి బాబు పటేల్ సార్ లో ఓ కీలక పాత్ర పోషించింది.
ఇక మలయాళలో 50కు పైగా సినిమాల్లో నటించింది పద్మప్రియ. అయితే సినిమా కెరీర్ ఫుల్ స్పీడ్ లో ఉన్నప్పుడే ఆమె 2014లో తన చిన్ననాటి స్నేహితుడు గుజరాత్ కు చెందిన జాస్మిన్ షాను ప్రేమ వివాహం చేసుకుంది. ఆయన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రధాన కార్యాలయం ఉన్న అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్‌లో దక్షిణాసియా పాలసీ హెడ్‌గా పనిచేస్తున్నారు. అయితే ఈ దంపతులకు ఇప్పటివరకు సంతానం లేదు.
నటి పద్మ ప్రియ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
‘ఒకప్పుడు పెళ్లే వద్దనుకున్నాను.. కానీ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాను. ఇప్పుడైతే నాకు పిల్లలు కావాలనుంది. అమ్మ అని పిలిపించుకోవాలని ఆశగా ఉంది’ అని ఆంటోంది పద్మ ప్రియ. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఆ ముచ్చట ఒక్కటి తీరిపోతే బాగుండు.. సంతానం పై పద్మ ప్రియ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








