AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ దెబ్బతో సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్నా.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్లుగా మారిపోతుంటారు. వరుస అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్‌డమ్ సొంతం చేసుకుంటారు. మరికొందరు మాత్రం అందం, అభినయం ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోతుంటారు. అవకాశాలు తగ్గడంతో సినిమాలకు దూరమవుతుంటారు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న హీరోయిన్లలో అందాల భామ నివేదా పేతురాజ్ ఒకరు.

ఆ దెబ్బతో సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్నా.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 27, 2026 | 8:36 AM

Share

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్లుగా మారిపోతుంటారు. వరుస అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్‌డమ్ సొంతం చేసుకుంటారు. మరికొందరు మాత్రం అందం, అభినయం ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోతుంటారు. అవకాశాలు తగ్గడంతో సినిమాలకు దూరమవుతుంటారు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న హీరోయిన్లలో అందాల భామ నివేదా పేతురాజ్ ఒకరు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఒకానొక సమయంలో సినిమాలనే వదిలేయాలని నిర్ణయించుకున్నానని, హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది. నివేదా పేతురాజ్ తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకున్న ఈ భామ.. ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంది.

చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, విరాట పర్వం, దాస్ కా ధమ్కీ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. నటనతో పాటు గ్లామర్‌తోనూ అభిమానులను సంపాదించుకుంది. అయితే కెరీర్‌లో ఆశించిన స్థాయిలో వరుస విజయాలు అందుకోలేకపోవడంతో కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో నివేదా పేతురాజ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. తనకు ఓ వ్యక్తితో ఉన్న ప్రేమ బంధాన్ని పరిచయం చేస్తూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలో వెల్లడించింది. అయితే ఆ తర్వాత వారి బంధం గురించి పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ఆమె వ్యక్తిగత జీవితం కూడా చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

కెరీర్‌లో ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో 2023లో సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నానని నివేదా పేతురాజ్ తాజాగా వెల్లడించింది. జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని చెప్పిన ఆమె.. మళ్లీ సినిమాల్లోకి రావడానికి అవకాశం కల్పించిన వారిపట్ల కృతజ్ఞతలు తెలిపింది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘సింగ్ గీతం’ సినిమాతో తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడం తనకు ఎంతో ప్రత్యేకమని ఆమె పేర్కొంది. ఈ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. ఈ సినిమా తనకు కొత్త జీవితాన్ని ఇచ్చిందనే భావనను వ్యక్తం చేస్తూ నివేదా పేతురాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాగ్ అశ్విన్ తనకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వకపోయి ఉంటే ఎక్కడో హిమాలయాల్లో ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్నని చెప్పుకొచ్చింది. సినిమాలను వదిలేయాలనుకున్న సమయంలో మళ్లీ మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందని తెలిపింది. ప్రస్తుతం నివేదా పేతురాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఆదర్శకుటుంబం సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us