Nazriya nazim: ఒకే ఏడాదిలో మూడు అద్భుతాలు జరిగాయి.. ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరోయిన్..
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడీగా ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
మలయాళ కుట్టీ నజ్రియా నజీమ్ (Nazriya Nazim) తొలిసారి తెలుగులో చేస్తున్న సినిమా అంటే సుందరానికీ. న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడీగా ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అంటే సుందరానికీ పై మరింత క్యూరియాసిటీని కలిగించింది. ప్రమోషన్లలో భాగంగా గురువారం అంటే సుందరానికీ ట్రైలర్ ను వైజాగ్ వేదికగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరోయిన్ నజ్రియా నజీమ్ మాట్లాడుతూ.. తాను తెలుగులో చేస్తున్న మొదటి సినిమా అంటే సుందరానికీ అని.. చాలా సంతోషంగా ఉందన్నారు.
నజ్రియా నజీమ్ మాట్లాడుతూ.. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది.. నాని భార్య వాళ్లది విశాఖపట్నం అని.. ఈ ప్రదేశం గురించి చాలా విన్నాను.. సినిమా అంటే మీకు చాలా ఇష్టమని.. ఎంతో ఆసక్తి చూపిస్తారని తెలిసిందే. ఈ సంవత్సరంలో నా జీవితంలో మూడు విషయాలు జరిగాయి. వాటిలో ఒకటి నేను ఫస్ట్ టైమ్ ఒక తెలుగు సినిమా చేయడం.. రెండవది నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోవడం..మూడోది వైజాగ్ రావడం.. నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారు.. అందరికీ థ్యాంక్స్. నాని మంచి యాక్టర్.. తన కారణంగానే ఈ సినిమాకు సంబంధించిన అనేక జ్ఞాపకాలున్నాయి. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.. జూన్ 10న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు అంటూ చెప్పుకొచ్చింది.