సౌందర్యతో పాటు నేను ఆ హెలికాఫ్టర్‌లో వెళ్ళాల్సింది.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్

తన నటనా ప్రతిభతో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కోట్లాది మంది అభిమానులును సొంతం చేసుకుంది. చక్కటి చీరకట్టులో.. నిండైన రూపంతో పదహారణాల తెలుగింటి అమ్మాయిగా తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ఒక్క తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించిందీ అందాల తార.

సౌందర్యతో పాటు నేను ఆ హెలికాఫ్టర్‌లో వెళ్ళాల్సింది.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్
Soundarya

Updated on: Sep 17, 2025 | 10:28 AM

అలనాటి అందాల తారల్లో సౌదర్యం మొదటి వరసలో ఉంటారు. శ్రీదేవి తర్వాత అంత క్రేజ్ తెచ్చుకున్నారు సౌందర్య. అందం, అభినయం కలబోసిన సౌందర్య ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. తన దైన నటనతో కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగులోనే కాదు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో ఆమె సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. తెలుగులో ఆమె చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. ముఖ్యంగా వెంకటేష్, సౌందర్య కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ సంప్రదాయ పద్దతిలోనే కనిపిస్తూ.. కేవలం నటనతోనే నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనుహ్యంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోయింది. సౌందర్య మరణాన్ని ఇప్పటికీ తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతుంటారు.

ఇది కూడా చదవండి : ఎన్టీఆర్‌కు లవర్‌గా.. హరికృష్ణకు కోడలిగా నటించిన ఏకైక హీరోయిన్.. సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా

ఓ హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య కన్నుమూశారు. తాజాగా సౌందర్య గురించి సీనియర్ నటి మీనా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. సౌదర్యతో పాటు తాను కూడా అదే హెలికాఫ్టర్ లో ప్రయాణించాల్సింది అని అన్నారు మీనా. ఇటీవలే నటుడు జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్మునిశ్చయమ్మురా అనే షోలో మీనా పాల్గొన్నారు. ఈ షోలో ఆమె సౌందర్య గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

ఇది కూడా చదవండి : మిరాయ్‌లో అదరగొట్టిన ఈ లేడీ విలన్ ఎవరో తెలుసా.? అమ్మబాబోయ్ ఈమె బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా..

సౌందర్య గురించి మాట్లాడుతూ .. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ .. చాలా మంచి వ్యక్తి.. ఆమె మరణవార్త విని నేను తట్టుకోలేకపోయా.. నిజానికి నేను కూడా అదే హెలికాఫ్టర్ లో ప్రచారానికి వెళ్లాలి.. కానీ నేను షూటింగ్ లో బిజీగా ఉండటంతో నేను వెళ్లలేదు అని తెలిపారు మీనా. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాంటి అందాల తార, గొప్ప నటికీ అలాంటి చావు రాకుండా ఉండాల్సింది అని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సౌందర్య ఉండిఉంటే ఇంకా ఎన్నో గొప్ప పాత్రలు చేసేవారు అని తెలుగు ప్రేక్షకులు గుర్తు చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : రెండుసార్లు ప్రేమలో పడింది.. ఇద్దరు పిల్లలకు తల్లయింది.. అప్పుడు తెలుగులో తోప్.. కానీ ఇప్పుడు ఇలా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.