సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఎట్టకేలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. సోమవారం (డిసెంబర్ 30) మీడియాతో జరిగిన చిట్ చాట్ లో ఈ ఘటనపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు.. అభిమాని మృతిచెందిన తర్వాత.. వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి.. ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్టైంది. అల్లుఅర్జునే కాదు..టీమ్ అయినా సంతాపం తెలపాల్సింది.. సీఎం రేవంత్‌రెడ్డి పేరు చెప్పలేదని.. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారనడం సరికాదు. రేవంత్ రెడ్డి ఆ స్థాయి దాటిన బలమైన నేత. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారు. చట్టం ఎవరికీ చుట్టం కాదు. దీని ముందు అందరూ సమానమే. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి’ అని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. తాజాగా డిప్యూటీ సీఎం కామెంట్స్ పై ప్రముఖ నటి కస్తూరి ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘పెద్దరికం అంటే పవన్ కళ్యాణ్‌దే. చాలా మెచ్యూరిటీ గా, ఎంతో హుందాగా మాట్లాడారు. ఎలాంటి పక్షవాతం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పారు. మనమందరం ఈ అల్లకల్లోలమైన విషాదాన్ని వదిలేసి వినయంగా 2025లోకి అడుగు పెడదాం’ అని అందులో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన కొన్ని ఆసక్తికర కామెంట్స్ ను సైతం ఆమె షేర్ చేసింది.
డిసెంబర్4 ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ దగ్గరకు పుష్ప టూ ప్రీమియర్ షోకు కుటుంబ సభ్యులతో వచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. తొమ్మిదేళ్ల ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఈ తొక్కిసలాట ఘటనలో ఏ11గా అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. దీంతో పోలీసులు అల్లు అర్జున్ ను డిసెంబర్ 13న అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు రెండువారాల రిమాండ్ విధించినా.. హైకోర్టు బెయిల్ మంజూరుచేయడంతో బయటకు వచ్చారు అల్లు అర్జున్.
Peddarikam ante Pawan. Very measured matured statement. 👏👏
No bias no compromise.#Pawanakalyan #alluArjun @PawanKalyan@JanaSenaPartyLet us all put this unfortunate tragedy behind us and move humbly into 2025. pic.twitter.com/xeKe98J1Gd
— Kasturi (@KasthuriShankar) December 30, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.