Ramayan: రీఎంట్రీలో హిట్టు కోసం వెయిటింగ్.. రామాయణ్‏లో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో మోస్ట్ అవైటెడ్ మూవీ రామాయణ. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా.. సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బీటౌన్ డైరెక్టర్ నితేశ్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

Ramayan: రీఎంట్రీలో హిట్టు కోసం వెయిటింగ్.. రామాయణ్‏లో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..
Ramayan

Updated on: May 16, 2025 | 3:30 PM

బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా రామాయణ. ఇందులో రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తుండగా.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు ప్రముఖులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కొన్నాళ్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మొత్తం మూడు భాగాలుగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్, భారీ తారాగణం మధ్య రూపొందిస్తున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ నుంచి లీక్ అయిన ఫోటోస్ మరింత ఆసక్తిని కలిగించాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాలో మరో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందని టాక్. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కీలకపాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

నివేదికల ప్రకారం ఈ సినిమాలో కాజల్.. రావణాసురుడి భార్య మండోదరి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే టీమ్ ఆమెను సంప్రదించిందని.. అందుకు కాజల్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. అంతేకాకుండా గత వారమే ఆమెకు సంబంధించి లుక్ టెస్ట్ కూడా జరిగిందని టాక్. ఒక వేళ అదే నిజమైతే.. పాన్ ఇండియా స్టార్ యశ్ జోడిగా కాజల్ కనిపించనుంది. ఈ సినిమాలో యశ్ రావణాసురిడి పాత్రలో కనిపించనున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆయన ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ సినిమా గురించి నెట్టింట లీక్ అవుతున్న అప్డేట్స్ మరింత అంచనాలు పెంచేస్తున్నాయి.

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో నితేశ్ తివారీ ఒకరు. ఇప్పటివరకు దంగల్, ఛిఛోరే, బవాల్ వంటి సూపర్ హిట్ చిత్రాలను రూపొందించారు. దీంతో ఆయన తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో రామాయణపై భారీ హైప్ నెలకొంది. అలాగే న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి మొదటిసారి హిందీలో నటిస్తున్న సినిమా ఇదే.

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..