Jyotika: చీరకట్టులో కర్రసాముతో అదరగొట్టిన హీరోయిన్ జ్యోతిక.. వైరలవుతున్న వీడియో.. రెండు కళ్లు చాలవు..

|

Feb 24, 2023 | 8:23 PM

జ్యోతికలో ఇప్పటివరకు కనిపించని మరో టాలెంట్ కూడా ఉందని మీకు తెలుసా. ఆమె ప్రతిభకు సంబంధించిన ఓ అద్భుతమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

Jyotika: చీరకట్టులో కర్రసాముతో అదరగొట్టిన హీరోయిన్ జ్యోతిక.. వైరలవుతున్న వీడియో.. రెండు కళ్లు చాలవు..
Jyothika
Follow us on

ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్లలో జ్యోతిక ఒకరు. మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని… సహజ నటనతో మెప్పించిన జ్యోతిక.. అటు తమిళంలోనూ అగ్రకథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ్ స్టార్ హీరో సూర్యతో వివాహం తర్వాత కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె.. ప్రస్తుతం సహయనటిగా.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మరోసారి తెరపై సందడి చేస్తున్నారు. అటు నటిగానే కాకుండా నిర్మాతగానూ సక్సెస్ అందుకుంటున్నారు జ్యోతిక. నటిగా.. ప్రొడ్యూసర్ గా.. తల్లిగా.. భార్యగా ఎన్నో బాధ్యతలతో బిజీగా ఉండే జ్యోతికలో ఇప్పటివరకు కనిపించని మరో టాలెంట్ కూడా ఉందని మీకు తెలుసా. ఆమె ప్రతిభకు సంబంధించిన ఓ అద్భుతమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

సాధారణంగా హీరోయిన్ అంటే గ్లామర్ షోలకు… కేవలం సున్నితంగా కనిపించే పాత్రలకు మాత్రమే సెలక్ట్ చేసుకుంటారు. కొద్దిలో కొందరు మాత్రమే మహిళా ప్రాధాన్యత ఉన్న మాస్ యాక్షన్ చిత్రాల్లో నటిస్తుంటారు. ఇక స్టంట్స్ అనేవి మన హీరోలు నిపుణుల పర్యవేక్షణలోనే చేస్తారు. కానీ జ్యోతిక మాత్రం ఏకంగా స్టేజీపైనే సంప్రదాయ చీరకట్టులో కర్రసాము అదరగొట్టేసింది. 2020లో JFW మూవీ అవార్డ్స్ వేడుకలలో యాంకర్స్, ప్రేక్షకుల కోరిక మేరకు కర్రసాము చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

చీరకట్టులో ఎంతో సంప్రదాయకంగా చూడముచ్చటగా కనిపిస్తున్న జ్యోతిక.. అంతే అందంగా కర్రసాము చేస్తోన్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. హీరోయిన్ టాలెంట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.