
అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తుంది. దఢక్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది జాన్వీ కపూర్. మొన్నటివరకు హిందీలో వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ బ్యూటీ. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లొనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎప్పటికప్పుడు ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతుంది ఈ చిన్నది.
ఇక గత ఏడాది ఎన్టీఆర్ కు జోడీగా దేవర సినిమాలో నటించింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది జాన్వీ. త్వరలోనే దేవర 2 రానుంది. అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన కూడా నటిస్తుంది జాన్వీ కపూర్. బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్దిలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో జాన్వీ అందాలకు యమా క్రేజ్ ఉంది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ చిన్నది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో నేను చాలా సార్లు నాకు పెళ్లయిందని అబద్దం చెప్పా.. వేరే దేశాలకు వెళ్ళినప్పుడు నేను ఎక్కువగా ఇలా అబద్దాలు చెప్తుంటా.. అమెరికా వెళ్ళినప్పుడు నేను ఏదైనా హోటల్ కు వెళ్ళినప్పుడు అక్కడి వెయిటర్స్, రెస్టారెంట్ వాళ్లు నాకు ఫోన్ నెంబర్లు ఇచ్చేవారు. నేను ఆర్డర్ ఇవ్వక ముందే నా టేబుల్ మీదకు ఫుడ్ వచ్చేస్తుంది.. దాంతో ఏం చేయాలో అర్ధం కాక నా స్నేహితుడు ఓరీకి నాకు పెళ్లి అయిందని అబద్దం చెప్పాను. దాంతో వాళ్లు నన్ను పట్టించుకోవడం మానేశారు. నేను ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను.. అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.
వర్త్ వర్మ వర్త్..! అప్పుడు క్యూట్ హీరోయిన్.. ఇప్పుడు హాట్ బ్యూటీ.. 42ఏళ్ల వయసులోనూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి