Genelia: సెకండ్ ఇన్నింగ్స్‏లో జెనీలియా జోరు.. మరోసారి స్టార్ హీరోకు జోడిగా హాసిని..

జెనీలియా... ఇటీవలే వేద్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో సూపర్ హిట్ అయిన మజిలీ చిత్రానికి సిక్వెల్ ఇది. ఇందులో బాలీవుడ్ స్టార్ రితేష్ దేశ్ ముఖ్ నటించారు. రియల్ లైఫ్ కపూల్స్.. మరోసారి వెండితెరపై జంటగా నటించి అలరించారు. ఇక వేద్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జెనీలియా ఇప్పుడు వరుస ఆఫర్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా మరో బిగ్ ప్రాజెక్ట్ లో జెనీలియా భాగమైనట్లు టాక్ వినిపిస్తోంది. అది కూడా బాలీవుడ్ బిగ్ స్టార్ జోడిగా కనిపించనుందట.

Genelia: సెకండ్ ఇన్నింగ్స్‏లో జెనీలియా జోరు.. మరోసారి స్టార్ హీరోకు జోడిగా హాసిని..
Genelia

Updated on: Oct 13, 2023 | 8:02 PM

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది జెనీలియా. బాయ్స్ సినిమాతో అరంగేట్రం చేసి ఆ తర్వాత అందరూ స్టార్ హీరోల జోడిగా నటించింది. సిద్ధార్థ్ సరసన బొమ్మరిల్లు సినిమాతో హాసినిగా తెలుగువారికి మరింత దగ్గరయ్యింది. పెళ్లి , పిల్లలతో సినిమాలకు దూరమైన జెనీలియా… ఇటీవలే వేద్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో సూపర్ హిట్ అయిన మజిలీ చిత్రానికి సిక్వెల్ ఇది. ఇందులో బాలీవుడ్ స్టార్ రితేష్ దేశ్ ముఖ్ నటించారు. రియల్ లైఫ్ కపూల్స్.. మరోసారి వెండితెరపై జంటగా నటించి అలరించారు. ఇక వేద్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జెనీలియా ఇప్పుడు వరుస ఆఫర్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా మరో బిగ్ ప్రాజెక్ట్ లో జెనీలియా భాగమైనట్లు టాక్ వినిపిస్తోంది. అది కూడా బాలీవుడ్ బిగ్ స్టార్ జోడిగా కనిపించనుందట. ఇటీవల అమీర్ ఖాన్ కొత్త చిత్రం గురించి సమాచారం బయటకు వచ్చింది. తాజాగా ‘సితారే జమీన్‌ పర్‌’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

లేటేస్ట్ సమాచారం ప్రకారం ‘సితారే జమీన్‌ పర్‌’ చిత్రంలో జెనీలియా దేశ్‌ముఖ్‌ , అమీర్‌ ఖాన్‌ జంటగా నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ‘సితారే జమీన్ పర్’ సినిమా కథాంశంతో ‘సితారే జమీన్ పర్’ సినిమా రూపొందబోతోంది. అమీర్ ఖాన్, జెనీలియా దేశ్‌ముఖ్‌లు కలిసి సినిమా చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో వీరిద్దరూ కలిసి ‘జానే తూ యా జానే నా’ చిత్రంలో నటించారు. ఆ సినిమాను అమీర్ ఖాన్ నిర్మించగా.. అతని సమీప బంధువు ఇమ్రాన్ ఖాన్ హీరోగా నటించారు. ఆ చిత్రానికి జెనీలియా డియోజా కథానాయికగా కనిపించింది. ఇప్పుడు అమీర్ ఖాన్ సరసన నటించేందుకు జెనీలియా సిద్ధమైంది.

ఇవి కూడా చదవండి

‘సితారే జమీన్ పర్’ సినిమాకు జెనీలియా దేశ్‌ముఖ్ సరిపోతుందని అమీర్ ఖాన్ భావిస్తున్నాడని.. అందుకే ఆమెతు ఇదే విషయాన్ని చర్చించినట్లుగా తెలుస్తోంది. అటు జెనీలియా ఈ సినిమాను అంగీకరించిందని తెలుస్తోంది.వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా సాగుతుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అడియన్స్. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి మరింత సమాచారం బయటకు రావాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.