ఆ హీరో చెప్పిన మాటలే నాకు ధైర్యాన్ని ఇచ్చాయి.. ఆసక్తికర విషయం చెప్పిన గీత సింగ్

టాలీవుడ్ హీరోయిన్ గీతా సింగ్ తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలోని కష్టనష్టాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆమె సినీ నేపథ్యం లేని నిజామాబాద్‌కు చెందిన మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చారు. ఆమె ఎంట్రీ తేజ దర్శకత్వంలో రూపొందిన జై (నవదీప్, సంతోషి జంటగా) చిత్రంతో జరిగింది.

ఆ హీరో చెప్పిన మాటలే నాకు ధైర్యాన్ని ఇచ్చాయి.. ఆసక్తికర విషయం చెప్పిన గీత సింగ్
Geetha Singh

Updated on: Apr 01, 2026 | 11:27 AM

లేడీ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి గీతా సింగ్.. గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న గీతాసింగ్ ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. గుడు గుడు గుంజము పాటతో టాలీవుడ్‌లో గీతా సింగ్ చేసి మరోసారి పాపులర్ అయ్యారు గీత, పరిశ్రమలో ఆమె ఎదుర్కొంటున్న సవాళ్లు, తన సినీ ప్రయాణం గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఈ పాట కేవలం ఒక వారంలోనే షూటింగ్ పూర్తి చేసుకుని, అనూహ్య విజయాన్ని సాధించడం వెనుక ఉన్న కథను ఆమె వెల్లడించారు. గీతా సింగ్ తన మేకప్ మ్యాన్ ఆర్కేతో 20-22 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం ఉందని తెలిపారు. చాలా కాలంగా ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నా.. సమయం కుదరలేదని చెప్పారు. చివరకు, ఒక రోజు పాట చేయాలని నిర్ణయించుకొని, కొరియోగ్రాఫర్లు అనిత, స్వరూప్ ఇంటికి వెళ్లారు. అక్కడ, గీతా సింగ్‌ను కామెడీగా కాకుండా, భారీ మాస్ స్టెప్స్ తో చూపించాలని టీమ్ నిర్ణయించుకుందని.. అనిత, స్వరూప్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఈ పాటను రూపొందించారని గీతా సింగ్ తెలిపారు.

ఆమె హీరోయినా.. అస్సలు వద్దు..! డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పిన విజయ్ సేతుపతి

చిత్రీకరణ సమయంలో అనిత గర్భవతిగా ఉన్నప్పటికీ, తన ఇంట్లోనే గీతా సింగ్‌ను ఉంచుకొని, మార్నింగ్ 10 నుండి 6 వరకు రిహార్సల్స్ నిర్వహించారని పేర్కొన్నారు. ఈ పాట కోసం ఎంతో శ్రమించినట్లు ఆమె చెప్పారు. ఈ కంబ్యాక్ వెనుక చిరంజీవి గారి మాటలు తనకు స్ఫూర్తి అని గీతా సింగ్ తెలిపారు. “మన కష్టం మనమే పడాలి, మన రాత మనమే రాసుకోవాలి, అదృష్టం, ఫేట్ వంటివి నేను నమ్మను” అనే చిరంజీవి గారి మాటలు తనకు వ్యక్తిగత ఇబ్బందుల నుండి బయటపడి కెరీర్‌పై దృష్టి పెట్టడానికి సహాయపడ్డాయని ఆమె వివరించారు. చాలా మంది “గీతా సింగ్ చేయలేదు” అని అన్నా, దానిని ఒక సవాలుగా తీసుకుని ముందుకు సాగినట్లు చెప్పారు.

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

గుడు గుడు గుంజము పాట విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ రాలేదని, ప్రేక్షకుల నుండి అద్భుతమైన ప్రేమ, ఆదరణ లభించిందని గీతా సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానెల్‌లకు మూడు నెలల్లోనే 100k మంది ఫాలోవర్లు వచ్చారని, ప్రతి ఒక్క కామెంట్‌కు తాను స్వయంగా స్పందిస్తానని ఆమె తెలిపారు. “మీరు ఉంటే నేను ఉన్నాను” అని చెప్పి అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు.

ఇవి కూడా చదవండి

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us