AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. పెళ్ళైన వ్యక్తిని ప్రేమించి.. చివరకు 22ఏళ్ల వయసులోనే..

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 70 చిత్రాల్లో నటించి, అగ్రతారగా వెలుగొందిన నటి ఆమె.. సినీ ప్రస్థానం అద్భుతమైనది. బాలచందర్, ఎన్టీఆర్ వంటి దిగ్గజ దర్శకులు, నటులతో కలిసి పనిచేసిన ఆమె కెరీర్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే చేతులారా కెరీర్ నాశనం చేసుకుంది.

స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. పెళ్ళైన వ్యక్తిని ప్రేమించి.. చివరకు 22ఏళ్ల వయసులోనే..
Actress
Rajeev Rayala
|

Updated on: May 31, 2026 | 6:08 PM

Share

తెలుగు సినిమా రంగంలో ఫటాఫట్ జయలక్ష్మి ఒక ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. ఆమె అసలు పేరు నీరజా రెడ్డి, 1958 నవంబర్‌లో చెన్నైలో జన్మించారు ఆమె. జయలక్ష్మి తండ్రి, దశరథరామి రెడ్డి, నెల్లూరుకు చెందిన ప్రముఖ కో-డైరెక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అలాగే డబ్బింగ్ ఇంచార్జ్. రజినీకాంత్‌కు కూడా ఆయన వాయిస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సినీ వాతావరణంలో పెరిగిన జయలక్ష్మి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆమె నటనా రంగ ప్రవేశానికి ప్రముఖ నటి వాణిశ్రీ ప్రోత్సాహం లభించింది. వాణిశ్రీ ఆమెను ఇద్దరు అమ్మాయిలు చిత్రంలో ఒక పాత్రలో నటించేలా చేశారు. ఆ తర్వాత ఆమె ప్రతిభ ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ దృష్టిని ఆకర్షించింది. బాలచందర్ గారి చిత్రాల్లో మెయిన్ క్యారెక్టర్స్ చేయడం ద్వారా జయలక్ష్మి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆమె కేవలం పది సంవత్సరాల వ్యవధిలోనే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 70 చిత్రాల్లో నటించారు.

ఇది కూడా చదవండి : వామ్మో..! మెంటలెక్కిపోయే ట్విస్ట్‌లు.. ఒంటరిగా చూడాల్సిన సినిమా… స్ట్రీమింగ్ ఎక్కడంటే

రజినీకాంత్‌తో కలిసి ముల్లు మలరం వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆరడిరుందు అరబతు వరై చిత్రంలో రజినీకాంత్ భార్య పాత్రలో ఆమె చేసిన త్యాగపూరిత నటనకు రజినీకాంత్ ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమాలో ఆమె నటనను “నన్ను మించిపోయింది” అని రజినీకాంత్ పేర్కొన్నారు. బాలచందర్ దర్శకత్వంలో స్వర్గం నరకం చిత్రంలో ఆమె ఈగోయిస్టిక్, పొసెసివ్ పాత్రలో నటించి విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పాత్ర సంసారాన్ని స్వర్గం చేసుకోవాలన్నా, నరకం చేసుకోవాలన్నా భార్య చేతిలోనే ఉందనే కాన్సెప్ట్‌ను చూపించింది. అలాగే, సీనియర్ ఎన్టీఆర్ తో యుగపురుషుడు, కృష్ణ గారితో రామ్ రాబర్ట్ రహీం వంటి చిత్రాల్లోనూ ఆమె నటించారు. రజినీకాంత్‌తో ఆమె ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరిందని, అనేక చిత్రాల్లో వారిద్దరూ కలిసి నటించారు.

ఇది కూడా చదవండి : బాలయ్య బిడ్డా మజాకా..! ఆ గ్రేస్ ముందు హీరోయిన్స్ తేలిపోతారుగా.. వీడియో వైరల్

ఆమె కెరీర్ ఉన్నత దశలో ఉండగానే, జీవితంలో ఒక కీలకమైన, ఓ నిర్ణయం తీసుకోవడం వల్ల ఆమె జీవితం విషాదకరంగా ముగిసిందని చర్చించుకుంటారు. ఎంజీఆర్ అన్న కొడుకు సుకుమారన్ తో ప్రేమలో పడి వివాహం ద్వారా తన జీవితానికి ఒక రాయల్టీ వస్తుందని ఆశపడి, తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే సుకుమారన్ కు పెళ్ళై, పిల్లలు కూడా ఉన్నారు. ఆతర్వాత సుకుమారన్ జయలక్ష్మిపై అనుమానం పెంచుకున్నారు. పెళ్లి చేసుకోవాలంటే సినిమాలు మానేయాలి అని కండిషన్ పెట్టాడు సుకుమారన్.. దాంతో ఆమె సినిమాలు మానేసింది. కానీ ఆయన పెళ్లి చేసుకోలేదు.. ఆ తర్వాత ఆయన అనుమానాలు డబుల్ అయ్యాయి. రోజూ మద్యం తాగి ఆమెతో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టారట సుకుమారన్. దాంతో ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు.. నాలుగురోజులు మ్యుత్యువుతో పోరాడి ఆతర్వాత కన్నుమూశారు జయలక్ష్మి. చనిపోయే నాటికి ఆమె వయసు కేవలం 22ఏళ్లు మాత్రమే..

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ప్రివ్యూ చూసి ఇదేం సినిమా.. అట్టర్ ఫ్లాప్ అన్నారు..! కట్ చేస్తే ఇండస్ట్రీలోనే క్లాసిక్ హిట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us