Faria Abdullah: ఓటీటీలోకి తొలి అడుగు.. ఫరియా అద్భుల్లా వెబ్ సిరీస్‌తో సక్సెస్ కొట్టేనా..

అందం అభినయం కలబోసిన ఈ భామ తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఫిదా చేసింది. జాతిరత్నాలు సినిమాలో అమాయకపు యువతిగా చక్కగా నటించి నవ్వులు పూయించింది.

Faria Abdullah: ఓటీటీలోకి తొలి అడుగు.. ఫరియా అద్భుల్లా వెబ్ సిరీస్‌తో సక్సెస్ కొట్టేనా..
Faria Abdullah
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 15, 2023 | 10:43 AM

చిట్టి నా చిల్ బుల్ చిట్టీ.. అనే పాట ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యింది ఈ పాట. అదే రేంజ్ లో పాపులర్ అయ్యింది హీరోయిన్ ఫారియా అబ్దుల్లా..ఈ హైదరాబాద్ బ్యూటీ జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అందం అభినయం కలబోసిన ఈ భామ తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఫిదా చేసింది. జాతిరత్నాలు సినిమాలో అమాయకపు యువతిగా చక్కగా నటించి నవ్వులు పూయించింది. ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. మెయిన్ హీరోయిన్ గా కంటే స్పెషల్ రోల్స్ లోనే ఎక్కువగా కనిపించింది ఈ పొడుగు కాళ్ళ సుందరి. ఇక బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి మెప్పించింది. ఆతర్వాత లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.

రీసెంట్ గా రవితేజ నటించిన రావణాసుర సినిమాలోనూ నటించింది. ఈ సినిమా థియేటర్స్ లో కంటే ఓటీటీలోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు ఓ రేంజ్ లో అభిమానులను ఆకట్టుకుంటుంది. రకరకాల ఫొటోలతోపాటు.. డాన్స్ వీడియోలను షేర్ చేసి ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది.

ఇక ఇప్పుడు ఈ అమ్మడు ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ ద జెంగబూరు కర్స్ . ఈ సిరీస్ క్లైమేట్ ఛేంజ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 9 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ వెబ్ సిరీస్ తో సక్సెస్ అయ్యారు. రీసెంట్ గా స్టార్ హీరోయిన్ తమన్నా కూడా వెబ్ సిరీస్ తో మరింత క్రేజ్ తెచ్చుకుంది.