AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raviteja: మాస్ మహారాజా సరసన ఇద్దరు హీరోయిన్స్.. అఫీషియల్‏గా ప్రకటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ యూనిట్..

Rama Rao On Duty: ఒకప్పుడు స్టార్ హీరోగా వరుస సూపర్ హిట్స్‏తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు మాస్ మహారాజా రవితేజ

Raviteja: మాస్ మహారాజా సరసన ఇద్దరు హీరోయిన్స్.. అఫీషియల్‏గా ప్రకటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' యూనిట్..
Rama Rao On Duty
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 19, 2021 | 1:51 PM

Share

Rama Rao On Duty: ఒకప్పుడు స్టార్ హీరోగా వరుస సూపర్ హిట్స్‏తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు మాస్ మహారాజా రవితేజ. గత కొన్ని సంవత్సరాలుగా ప్లాపులతో నెట్టుకొస్తున్న మాస్ రవితేజ.. ఇటీవల విడుదలైన “క్రాక్” సినిమాతో హిట్ అందుకుని ఫుల్ జోష్‏లో ఉన్నారు. ఈ మూవీతో రవితేజ మళ్లీ ఫాంలోకి వచ్చాడు.. దీంతో మళ్లీ వరుస ప్రాజెక్ట్స్‏ను పట్టాలెక్కించే పనిలో పడ్డారు ఈ మాస్ హీరో. ప్రస్తుతం రవితేజ.. డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో “ఖిలాడి” సినిమా చేస్తున్నారు. ఇందులో డింపుల్ హయాతి హీరోయిన్‏గా నటిస్తుండగా.. ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగానే.. మరో ప్రాజెక్ట్‏ను అనౌన్స్ చేశాడు రవితేజ.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శరత్ మండవ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ కెరీర్‏లో 68వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇటీవలే “రామరావు” అనే టైటిల్‎ను ఖారారు చేసింది చిత్రయూనిట్. తాజాగా “ఆన్ డ్యూటీ” అనే క్యాప్షన్‏తో ఉన్న ఫస్ట్‏లుక్ పోస్టర్ కు విశేషస్పందన లభించింది. వాస్తవిక ఘటనల ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్లర్‏గా ఈ మూవీ తెరకెక్కుతుండగా.. ఇందులో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్‏గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీలో నటించే హీరోయిన్స్ గురించి అఫీషియల్‏గా ప్రకటించింది చిత్రయూనిట్. “మజిలీ” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దివ్యాంశ కౌశిక్, తమిళ్, మలయాళం సినిమాల్లో నటించిన రజిషా విజయన్ హీరోయిన్స్‏గా నటిస్తున్నారని.. చిత్ర నిర్మాణ సంస్థ ఎస్ఎల్‏వీ సినిమాస్ ట్వీట్ చేసింది. అటు ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

ట్వీట్..

Also Read: Eesha Rebba: తెలుగు ముద్దుగుమ్మకు టాలీవుడ్‏లో ఆఫర్స్.. నెట్టింట్లో ఈషా రెబ్బా హల్‏చల్..

Karthika Deepam: మోనిత గతం వెలుగులోకి.. అంజిని పట్టుకుంటే నిజం తెలుస్తుందంటున్న దీప..

Nivetha Pethu Raj: డైరెక్షన్ చేయడం ఇష్టమంటున్న హీరోయిన్.. త్వరలోనే సినిమా చేసే ఆలోచనలో నివేతా..

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!