Viral: పత్తి తొక్కుతున్న ఈ అమ్మాయి టాలీవుడ్ ఫేమస్ నటి.. ఎవరో మీరు గుర్తుపట్టారా..?

అరె ఈ అమ్మాయి భలే పత్తి తొక్కుతుందే.. అనుకుంటున్నారా..? పిల్ల బాగా కష్టపడేది అనుకుంట అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారా..? తను ఓ ఫేమస్ నటి.. ఎవరో మీరు కనిపెట్టగలరా..?

Viral: పత్తి తొక్కుతున్న ఈ అమ్మాయి టాలీవుడ్ ఫేమస్ నటి.. ఎవరో మీరు గుర్తుపట్టారా..?
Telugu Actress
Follow us

|

Updated on: Oct 08, 2024 | 3:00 PM

యాక్టర్స్‌కు చాలా ఎగ్జైటింగ్ లైఫ్ ఉంటుంది. సినిమా.. సినిమాకు వైవిధ్యంతో కూడిన పాత్రలు పోషిస్తారు. విభిన్న సంస్కృతుకు, సంప్రదాయాలు తెలిసుకునే వెసులుబాటు ఉంటుంది. అందేకాదు.. షూటింగ్ కోసం ఢిపరెంట్ లోకేషన్స్‌కు వెళ్లొచ్చు. అక్కడ అందమైన ప్రదేశాలను చూడొచ్చు. అక్కడి కల్చర్‌పై అవగాహన తెచ్చుకోవచ్చు. ఇలా సెలబ్రిటీలు తాము షూటింగ్ లోకేషన్స్‌లో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. అలానే గతంలో ఈ నటి.. సినిమా చిత్రీకరణ కోసం.. తెలంగాణలోని కరీంనగర్ ప్రాంతానికి వెళ్లింది. అక్కడి మనుషులు, వారు మాట్లాడే విధానం, పద్దుతులు చూసి ఎగ్జైట్ అయింది. అంతేకాదు పొలం గట్లపై తిరుగుతూ పల్లెటూరి వెదర్ ఎంజాయ్ చేసింది. పొలంలో ట్రాక్టర్ తోలింది. అక్కడి లోకల్ వంటకాలను రుచి చూసింది. ఇంకో స్పెషల్ ఏంటంటే.. బస్తాల్లోకి పత్తి తొక్కింది. రైతులు పత్తి అమ్మిన తర్వాత ఇలా.. వాటిని తీసుకెళ్లేందుకు ఇలా బస్తాల్లోకి పత్తి తొక్కుతారు. ఇంతకీ తనెవరో మీరు గుర్తించారా..?

అయ్యో  లేదా.. ఎంత తీక్షణంగా చూసినా ఐడియా రావడం లేదా..? సరే మేమే చెప్పేస్తాం. తను తెలుగు, తమిళ భాషల్లో ఫేమస్ నటి ధన్య బాలకృష్ణ. కర్ణాటకకు చెందిన ధన్య.. తెలుగునాట నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తోన్న ఆమె.. గతంలో హీరోయిన్‌గా కూడా చేసింది.  చివరిగా తను ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతోన్న.. షర్మ & అంబానీ వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించింది. అయితే ఇటీవల కాలంలో ధన్యకు తెలుగులో మంచి అవకాశాలు రావడం లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.