Kangana Ranaut: ఆమెకు పట్టిన గతే నీకు కూడా.. కంగనా రనౌత్‌కు హత్యా బెదిరింపులు.. కారణమేంటంటే?

|

Aug 27, 2024 | 9:54 PM

బాలీవుడ్ ప్రముఖ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఈ మధ్యన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తన ద్వేషపూరిత కామెంట్లు, ట్వీట్లతో తరచూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా రైతు ఉద్యమంపై కంగనా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. సొంత పార్టీ నేతలే దీనిపై కలగజేసుకుని కంగనాకు అక్షింతలు వేశారు.  ఇప్పుడు కంగనాకు ఏకంగా హత్యా బెదిరింపులు వస్తున్నాయి.ఇందుకు ప్రధాన కారణం...

Kangana Ranaut: ఆమెకు పట్టిన గతే నీకు కూడా.. కంగనా రనౌత్‌కు హత్యా బెదిరింపులు.. కారణమేంటంటే?
Kangana Ranaut
Follow us on

బాలీవుడ్ ప్రముఖ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఈ మధ్యన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తన ద్వేషపూరిత కామెంట్లు, ట్వీట్లతో తరచూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా రైతు ఉద్యమంపై కంగనా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. సొంత పార్టీ నేతలే దీనిపై కలగజేసుకుని కంగనాకు అక్షింతలు వేశారు.  ఇప్పుడు కంగనాకు ఏకంగా హత్యా బెదిరింపులు వస్తున్నాయి.ఇందుకు ప్రధాన కారణం ఆమె నటించి దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమా. ఇందులో ఆమె మాజీ ప్రధాన మంత్రి దివంగత ఇందిరాగాంధీ పాత్రను పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా కొందరు సినిమా విడుదల చేయకూడదని పట్టుబడుతున్నారు. తమ మాట వినకుండా మూవీని రిలీజ్ చేస్తే చంపేస్తామని కంగనాను బెదిరిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో ద్వారా పంచుకున్నారు. ఇందులో భాగంగా ఒక వీడియోను అందులో షేర్ చేశారు. అందులో సిక్కు వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఒక గదిలో కూర్చున్నారు

‘ ఎమర్జెన్సీ చిత్రాన్ని విడుదల చేస్తే, మిమ్మల్ని పంజాబీలు మాత్రమే కాదు, క్రైస్తవులు కూడా చెప్పులతో కొడతారు. ముస్లింలు, హిందువులు కూడా మీకు చెప్పులతో స్వాగతం పలుకుతారు’ అని చెప్పుకొచ్చాడు. అదే వీడియోలో మరో పంజాబీ వ్యక్తి మాట్లాడుతూ, ‘ మీరు జర్నల్ సింగ్ బిందార్న్‌వాలేను టెర్రరిస్ట్‌గా సినిమాలో చూపించినట్లయితే, మీకు ఇందిరా గాంధీకి పట్టిన గతే పడుతుంది . వారి కోసం మా తలలు నరకడానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోలో ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు ఐజాజ్ ఖాన్ కూడా ఉన్నారు. అయితే ఆయన ఏమీ మాట్లాడలేదు.

ఇవి కూడా చదవండి

కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాపై సిక్కుల సంఘం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇందిరా గాంధీ హత్య సిక్కు వర్గానికి చెందిన ఆమె అంగరక్షకులే చేశారు. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలోకి చొరబడిన కొందరు వేర్పాటువాదులను ఇందిరాగాంధీ ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ నిర్వహించి హతమార్చారు. ఈ కారణంగానే ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. ఇప్పుడు కంగనా, ఇందిరాగాంధీ సినిమా ‘బ్లూ స్టార్ ఆపరేషన్’ ఘటనను ప్రస్తావించబోతోంది. వేర్పాటువాదులను టెర్రరిస్టులుగా చూపించే అవకాశం ఉన్నందున చాలా మంది సిక్కు వర్గానికి చెందినవారు ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నారు.

కంగనాకు వచ్చిన బెదిరింపు వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.