Bhumika Chawla: ‘ఆ ఛాన్స్ కోసం ఏడాది వెయిట్ చేశాను.. కానీ రెండు సినిమాల్లో నన్ను తీసేశారు’.. భూమిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

తాజాగా సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా నటించిన కిసి కీ భాయ్ కిసికీ జాన్ చిత్రంలో కనిపించింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హిందీలో తొలినాళ్లలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు.

Bhumika Chawla: ఆ ఛాన్స్ కోసం ఏడాది వెయిట్ చేశాను.. కానీ రెండు సినిమాల్లో నన్ను తీసేశారు.. భూమిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Bhumika

Updated on: Apr 26, 2023 | 11:45 AM

తెలుగు చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది భూమిక ఛావ్లా. మెగాస్టార్ చిరంజీవి.. పవన్ కళ్యాణ్, వెంకటేష్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా.. అటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే పెళ్లి చేసుకున్నాక ఇండస్ట్రీకి దూరమైంది భూమిక. చాలా కాలం తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. పలు చిత్రాల సహయ పాత్రలలో నటించింది. అక్కగా.. వదినగా పలు స్టార్స్ చిత్రాల్లో కనిపించిన ఆమె.. తాజాగా సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా నటించిన కిసి కీ భాయ్ కిసికీ జాన్ చిత్రంలో కనిపించింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల భూమిక పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హిందీలో తొలినాళ్లలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు.

హిందీలో భూమిక నటించిన తొలి చిత్రం తేరే నామ్. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటించగా.. దివంగత దర్శకుడు సతీష్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిట్ కావడంతో ఆ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయట. కానీ రెండు సినిమాలు ఒప్పుకున్నాక తనను తీసివేశారని చెప్పుకొచ్చింది. “నా ఫస్ట్ మూవీ తేరే నామా. ఈ సినిమా తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. నేను సినిమాలను అచి తూచి ఎంపిక చేసుకుంటాను. అలా ఓ పెద్ద ప్రాజెక్టుకు ఓకే చేశాను. కానీ దురదృష్ణవశాత్తు.. దర్శకుడు, నిర్మాణ సంస్థ, హీరో మారారు. ఆ తర్వాత నా స్థానంలో మరో నాయికను ఎంచుకున్నారు. ఆ సినిమా నేను చేసి ఉంటే మరోలా ఉండేది. ఏది జరగాలనుకుంటే అది జరుగుతుందనుకున్నాను. కానీ ఆ సినిమా కోసం మరే మూవీ ఒప్పుకోకుండా ఏడాదిపాటు ఎదురుచూశాను. చివరికి నిరాశే ఎదురు్కావడంతో వేరే సినిమాలకు సైన్ చేశాను. కానీ తేరే నామ్ వంటి పెద్ద హిట్ నాకు హిందీలో మళ్లీ రాలేదు.

ఆ తర్వాత జబ్ వుట్ మెట్ సినిమాకు సైన్ చేశాను. ఆ సినిమాకు ముందుగా బాబీ డియోల్ నేను అన్నారు. ఆ తర్వాత షాహిద్ కపూర్ అన్నారు. చివరకు షాహిద్, అయోషా టాకియా అన్నారు.. కానీ షాహిద్, కరీనా కపూర్ జంటగా సినిమా చేశారు. ఆ మూవీ నుంచి నన్ను తీసేశారు. మున్నా భాయ్ ఎంబీబీఎస్ సినిమాకు ఓకే చేసినా.. అది కూడా సక్సెస్ కాలేదు. ఇవేకాకుండా మణిరత్నం కన్నతిల్ ముత్తమిట్టల్ సినిమాలో నేనే హీరోయిన్ అని చెప్పి చివరకు హ్యాండిచ్చారు” అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.