Anasuya Bharadwaj : ఆ సినిమాలో డ్యూయల్ రోల్‌లో నటించనుందట అందాల అనసూయ..
బుల్లితెర బ్యూటీ అనసూయ అటు చిన్న తెరపైన ఇటు పెద్ద తెరపైన సందడి చేస్తున్న విషయం తెలిసిందే. టీవీ షోలతో బిజీగా గడుపుతునే.. సినిమాల్లోనూ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ అలరిస్తుంది అనసూయ.

Anasuya Bharadwaj : బుల్లితెర బ్యూటీ అనసూయ అటు చిన్న తెరపైన ఇటు పెద్ద తెరపైన సందడి చేస్తున్న విషయం తెలిసిందే. టీవీ షోలతో బిజీగా గడుపుతునే.. సినిమాల్లోనూ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ అలరిస్తుంది అనసూయ. ఇప్పటికే పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది ఈ అందాల భామ. అందం.. అభినయంతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది అనసూయ. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలలో నటిస్తూ వెండితెరపై దూసుకుపోతుంది అనసూయ. రంగమ్మత్త పాత్రతో అనసూయ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. రంగస్థలం సినిమా తర్వాత అనసూయకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ యాంకరమ్మ. ఇక రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాలో దాక్షాయణిగా నెగిటివ్ రోల్ లో కనిపించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు తమిళ్ లో ను తన సత్తా చాటనుంది.
ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో దాక్షాయణి అనే పాత్రలో మెప్పించింది అనసూయ. నెగిటివ్ పాత్రలో ఆకట్టుకుంది అనసూయ. అలాగే రవితేజ నటించిన ఖిలాడి సినిమాలో నటించింది అనసూయ. ఈ సినిమాలో కూడా అనసూయ నెగిటివ్ పాత్రలో కనిపించనుందట ఈ ముద్దుగుమ్మ. మరో వైపు ఖిలాడిలో అనసూయ పాత్ర ద్విపాత్రాభినయంతో అదరగొడుతుందట. ఈ సినిమాలో ఓ రోల్ మాత్రం బ్రాహ్మాణ యువతి పాత్ర అని అంటున్నారు. ఒక పాత్ర చనిపోతుందని మరో పాత్ర చివరి వరకూ ఉంటుందని అంటున్నారు. అలాగే కృష్ణ వంశీ దర్శకత్వంలో రంగమార్తాండ మూవీలో నటిస్తుంది. ఈ సినిమాతో తనకు పేరు తెస్తుందని అనసూయ భావిస్తుంది. ఇవేగాక.. ఇంకొన్ని చిన్న చిత్రాల్లోనూ అనసూయకి అవకాశాలు అందుకుంటుంది.
మరిన్ని ఇక్కడ చదవండి : Lata Mangeshkar: కోలుకుంటున్న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. మంత్రి ఏమన్నారంటే..?
