ప్రతి రోజూ రోమాంచకం ఫీల్ మా అందరిలో ఉండేది: అనంతిక సనిల్ కుమార్
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా "రోమాంచకం". సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా “రోమాంచకం”. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు ఈ సినిమా సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఆ హీరో అర్ధరాత్రి అడవి మధ్యలో నాకు నాటుకోడి కావాలి అని అడిగాడు.. నేను షాక్ అయ్యా
ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా “రోమాంచకం” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోహీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ మాట్లాడుతూ – మా రోమాంచకం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన విజయ్ గారికి థ్యాంక్స్. ఈ రోమాంచకం జర్నీలో పార్ట్ కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
అతను చాలా మంచి మనిషి..! అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నన్ను చూసి లేచి నిలబడతాడు..
అలాగే ఆమె మాట్లాడుతూ.. మా ప్రొడ్యూసర్ సందీప్, ప్రణయ్ గారికి, మా డైరెక్టర్ వేణుగోపాల్ గారికి థ్యాంక్స్. ఈ టీమ్ అందరితో ఎంతో సరదాగా, సంతోషంగా వర్క్ చేశాను. ప్రతి రోజూ రోమాంచకం ఫీల్ మా అందరిలో ఉండేది. డీవోపీ పవన్, మ్యూజిక్ డైరెక్టర్ వాసుకీ బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు. సెప్టెంబర్ 3న మా సినిమా రిలీజ్ అవుతోంది. మీరంతా థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నా. రోమాంచకం ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో చూసి ఎంజాయ్ చేసే ఎంటర్ టైనర్. అన్నారు.
16 ఏళ్లకే ఎంట్రీ 26ఏళ్లకే కెరీర్ క్లోజ్..! పెళ్ళైన 15 రోజులకే పారిపోయిన భర్త..!! ఈ హీరోయిన్ లైఫ్ లో సినిమాకు మించిన ట్విస్ట్‌లు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




