AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వార్మప్‌ మ్యాచ్‌లో ఊహించని ప్రమాదం.. పిచ్ రోలర్ కింద పడిన దిగ్గజ ప్లేయర్.. ఆ తర్వాత..!

Andros Townsend Pitch Roller Accident Thai League: థాయ్ లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్ వామప్ సమయంలో ఇంగ్లాండ్ (England) మాజీ అంతర్జాతీయ ఆటగాడు ఆండ్రోస్ టౌన్‌సండ్ (Andros Townsend) ఊహించని ప్రమాదానికి గురయ్యారు. మైదానంలో కదులుతున్న పిచ్ రోలర్ ఈ 35 ఏళ్ల ప్లేయర్ కాళ్లు, తుంటిపై నుంచి వెళ్లడంతో క్రీడా వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.

Video: వార్మప్‌ మ్యాచ్‌లో ఊహించని ప్రమాదం.. పిచ్ రోలర్ కింద పడిన దిగ్గజ ప్లేయర్.. ఆ తర్వాత..!
Andros Townsend Pitch Roller Accident Thai League
Venkata Chari
|

Updated on: Sep 21, 2026 | 7:24 AM

Share

Andros Townsend Pitch Roller Accident Thai League: పీటీ ప్రచువాప్ (PT Prachuap) ప్రాతినిధ్యం వహిస్తున్న ఆండ్రోస్ టౌన్‌సండ్ (Andros Townsend) పట్టాని (Pattani) జట్టుతో జరిగిన మ్యాచ్‌కు ముందు మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో గాల్లోకి లేచిన బంతిని అద్భుతమైన బ్యాక్‌హీల్ షేప్‌తో గోల్ పోస్ట్ వైపు కొట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఆయన నేలపై పడగా, అప్పటికే కదులుతున్న పిచ్ రోలర్‌ను డ్రైవర్ గమనించకపోవడంతో వాహనం ఆ ఆటగాడి శరీరంపైకి దూసుకెళ్లింది. రోలర్ చక్రాలు ఆయన కాళ్లు, తుంటి భాగం మీద నుంచి వెళ్లడంతో అక్కడివారంతా భయంతో హడలిపోయారు. మైదానంలో ఉన్న తోటి ఆటగాళ్ళు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

అదృష్టవశాత్తూ టౌన్‌సండ్‌కు ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదని సమాచారం అందడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన ఈ విచిత్ర సంఘటనను ఆ ఆటగాడు కూడా తేలికగా తీసుకున్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియోను షేర్ చేస్తూ నవ్వుతున్న ఎమోజీలను జతచేశాడు. అలాగే తన స్టోరీస్‌లో దీనిపై చమత్కారంగా స్పందిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడటమే కాకుండా, మ్యాచ్ చివరి నిమిషంలో సబ్ ఆటగాడిగా బరిలోకి దిగడం విశేషం.

ఈ పోరులో ప్రచువాప్ జట్టు 3 – 0 తేడాతో విజయం సాధించింది. గతంలో టోటెన్‌హామ్ (Tottenham), క్రిస్టల్ ప్యాలస్ (Crystal Palace) క్లబ్‌ల తరపున ఆడిన ఈ ఆటగాడు, ఇంగ్లాండ్ జాతీయ జట్టు (England Football Team) తరపున 13 మ్యాచ్‌లు ఆడాడు. ఆగస్టు నెలలో కంచనబురి పవర్ (Kanchanaburi Power) క్లబ్ నుంచి ప్రచువాప్ జట్టులో చేరిన ఈ వింగర్ తాజా ఘటనతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నామినేషన్‌కు గుర్రాలపై ఎంట్రీ.. గబ్బర్ సింగ్‌ను తలపిస్తూ హంగామా!
నామినేషన్‌కు గుర్రాలపై ఎంట్రీ.. గబ్బర్ సింగ్‌ను తలపిస్తూ హంగామా!
13 సిక్సర్లు, 8 ఫోర్లతో ఊహించని విధ్వంసం..
13 సిక్సర్లు, 8 ఫోర్లతో ఊహించని విధ్వంసం..
చలికాలంలో హెయిర్ లాస్ సమస్యగా మారిందా.. ఈ టిప్స్ మీకోసమే !!
చలికాలంలో హెయిర్ లాస్ సమస్యగా మారిందా.. ఈ టిప్స్ మీకోసమే !!
బుధుడి అనుగ్రహం.. డిసెంబర్ 4 నుంచి వీరికి ఆర్థికంగా తిరుగే ఉండదు
బుధుడి అనుగ్రహం.. డిసెంబర్ 4 నుంచి వీరికి ఆర్థికంగా తిరుగే ఉండదు
లోపల రంధ్రం లేకుండానే పండ్లలోకి పురుగులు ఎలా వెళ్తాయి?
లోపల రంధ్రం లేకుండానే పండ్లలోకి పురుగులు ఎలా వెళ్తాయి?
ప్రతీఒక్కరి అకౌంట్లోకి రూ.15 వేలు.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ప్రతీఒక్కరి అకౌంట్లోకి రూ.15 వేలు.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
రిటెన్షన్ తర్వాత పవర్ ఫుల్ టీం, వరస్ట్ టీంలు ఏవో తెలుసా..?
రిటెన్షన్ తర్వాత పవర్ ఫుల్ టీం, వరస్ట్ టీంలు ఏవో తెలుసా..?
కార్తీక పౌర్ణమి రోజు దీపదానం ఎందుకు చేయాలి? దీపాలు వెలిగించడం..
కార్తీక పౌర్ణమి రోజు దీపదానం ఎందుకు చేయాలి? దీపాలు వెలిగించడం..
భారత్‌లో మాత్రమే కనిపించే వింత కప్పల గురించి మీకు తెలుసా?
భారత్‌లో మాత్రమే కనిపించే వింత కప్పల గురించి మీకు తెలుసా?
సినిమా అద్భుతంగా ఉంది, కానీ ఆడటానికి ఛాన్స్ లేదన్నారు..
సినిమా అద్భుతంగా ఉంది, కానీ ఆడటానికి ఛాన్స్ లేదన్నారు..