Hanu-Man : విజయ్ సేతుపతి వదిలిన మీనాక్షి లుక్.. ‘హను-మ్యాన్’లో హీరోయిన్‌గా ఆ భామ
కుర్రహీరో తేజ సజ్జ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించిన తేజ. ఇప్పుడు హీరోగా అలరిస్తున్నాడు.
Hanu-Man : కుర్రహీరో తేజ సజ్జ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించిన తేజ. ఇప్పుడు హీరోగా అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో నటించాడు తేజ. ఆతర్వాత హీరోగా జాంబీరెడ్డి సినిమాలో నటించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిచాడు. ఈ సినిమా తర్వాత ఇష్క్ అనే సినిమా చేశాడు తేజ కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆతర్వాత రీసెంట్ గా అద్భుతం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓటీటీ వేదిక విడుదలైన ఈ సినిమాలో శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు ఈ కుర్ర హీరో.
ఈ సినిమా హనుమాన్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. భారతీయ పురాణేతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో వరుస చిత్రాలను రూపొందిస్తున్నామని ముందే టైటిల్ ప్రకటన వేళ వెల్లడించారు. `హను-మాన్` నుంచి హనుమంతు ను పరిచయం చేయగా ఆకట్టుకుంది. తేజ సజ్జా సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నాడని క్లారిటీ వచ్చింది. తాజాగా ఈ సినిమానుంచి అంజనాద్రి నుంచి మీనాక్షి ని కలవండి! అంటూ ప్రీ లుక్ ను విడుదల చేశారు. ఈమేరకు విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. సముద్ర అలలపై ఎగిరెగిరిపడుతున్న చేప న్ని పోస్టర్ లో చూపించారు తాజాగా హీరోయిన్ లుక్ ను విలక్షణ నటుడు విజయ్ దెతుపతి విడుదల చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి పాత్రలో అమృత అయ్యర్ నటిస్తుంది. ఈ మేరకు విడుదలైన ఆమె లుక్ ఆట్టుకుంటుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :