అలాంటి రోల్స్ అస్సలు చేయను.. 50 ఏళ్ల వయసులో దూసుకుపోతున్న హీరోయిన్.. జోరు ఇప్పుట్లో ఆగేలా లేదుగా..

ఒకప్పుడు భారతీయ సినీపరిశ్రమలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగుతోపాటు హిందీ, తమిళం భాషలలో అగ్ర హీరోలకు జోడిగా నటించి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం 50 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో తెలుసా.. ?

అలాంటి రోల్స్ అస్సలు చేయను.. 50 ఏళ్ల వయసులో దూసుకుపోతున్న హీరోయిన్.. జోరు ఇప్పుట్లో ఆగేలా లేదుగా..
Ameesha Patel

Updated on: Jul 13, 2025 | 11:07 AM

తెలుగు సినీపరిశ్రమలో తక్కువ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఆమె. ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకున్న తారలలో ఆమె ఒకరు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు హిందీలో వరుస సినిమాలతో అలరిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వయసు 50 సంవత్సరాలు. అయినప్పటికీ పెళ్లికి దూరంగా ఉంటూ సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అంతేకాకుండా ఆంటీ రోల్స్ అస్సలు చేయను.. హీరోయిన్ గానే నటిస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ? తనే అమిషా పటేల్. ఒకప్పుడు హోమ్లీగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు గ్లామర్ షోతో రచ్చ చేస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీలో అందం, అభినయంతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ఘన విజయం సాధించడంతోపాటు అమీషాకు తెలుగులో పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబు జోడిగా నాని చిత్రంలోనూ మెరిసింది. అంతేకాకుండా ఎన్టీఆర్ సరసన సైతం నటించింది. తెలుగుతోపాటు బాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు అందుకుంది. కానీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసినప్పటికీ ఈ బ్యూటీకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం 50 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల అమ్మాయిగా తన ఫిట్నెస్ తో ఆశ్చర్యపరుస్తుంది. కుర్ర హీరోయిన్లకు సైతం అసూయ పుట్టేలా గ్లామర్ షోతో నెట్టింట రచ్చ చేస్తుంది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. బాలీవుట్ సీనియర్ హీరో సన్నీ డియోల్ నటించిన గదర్ 2 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ భారీ విజయాన్ని సాధించడంతో మళ్లీ ఫాంలోకి వచ్చింది అమీషా. ఇప్పుడు సీనియర్ హీరోలకు జోడిగా బెస్ట్ ఛాయిస్ గా మారింది.

ఇవి కూడా చదవండి : 

Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?

Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..

Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్‏లోకి సోషల్ మీడియా క్రేజీ బ్యూటీ.. నెట్టింట ఫుల్ లిస్ట్ లీక్.. ఇక రచ్చే..

Cinema: ప్రపంచ రికార్డ్స్ బద్దలుకొట్టిన సినిమా అది.. 19 ఏళ్ల క్రితమే దుమ్మురేపింది.. ఇప్పటికీ ట్రెండింగ్‏లోనే..