AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aksha Pardasany : సినిమాటోగ్రాఫర్‏ను ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోస్ వైరల్..

నిఖిల్ సిద్ధార్థ్ సరసన యువత .. రామ్ పోతినేని జోడిగా కందిరీగ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. రైడ్, బెంగాల్ టైగర్, శత్రువు, రాధా, డిక్టేటర్ లాంటి చిత్రాల్లో నటించి అలరించింది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. దీంతో ఓటీటీకి షిఫ్ట్ అయ్యింది. 2017 తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ రాలేదు. దీంతో ఇండస్ట్రీకి దూరమై బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడే పలు చిత్రాలు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ప్రియుడితో కలిసి ఏడడుగులు వేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

Aksha Pardasany : సినిమాటోగ్రాఫర్‏ను ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోస్ వైరల్..
Aksha Pardasany
Rajitha Chanti
|

Updated on: Feb 27, 2024 | 9:21 AM

Share

తెలుగు సినీ పరిశ్రమలో ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా.. అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ పోతినేని, నిఖిల్ సిద్ధార్థ్ వంటి హీరోలతో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తనే హీరోయిన్ అక్షా పార్దసాని. ఒకప్పుడు చిత్రసీమలో ఆఫర్స్ అందుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. నిఖిల్ సిద్ధార్థ్ సరసన యువత .. రామ్ పోతినేని జోడిగా కందిరీగ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. రైడ్, బెంగాల్ టైగర్, శత్రువు, రాధా, డిక్టేటర్ లాంటి చిత్రాల్లో నటించి అలరించింది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. దీంతో ఓటీటీకి షిఫ్ట్ అయ్యింది. 2017 తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ రాలేదు. దీంతో ఇండస్ట్రీకి దూరమై బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడే పలు చిత్రాలు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ప్రియుడితో కలిసి ఏడడుగులు వేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

అక్ష పార్దసాని బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కౌశల్ ను వివాహం చేసుకుంది. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల్ని ఒప్పించి ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఫిబ్రవరి 26న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను అక్షా తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే ఈ వేడుకలో పెళ్లి కొడుకు మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరలవుతుంది. నార్త్ వెడ్డింగ్స్ లో ఎక్కువగా పెళ్లి కొడుకులు గుర్రంపై ఊరెంగిప్పుగా వస్తుంటారు. కానీ కౌశల్ సినిమాటోగ్రాఫర్ కావడంతో షూటింగ్ కు వాడే కెమెరా క్రేన్ మీద కూర్చొని పెళ్లిలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్. అలాగే కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అక్షా పార్దసాని.. ఖాట్మండు కనెక్షన్, జమ్తారా, రఫు చక్కర్ వంటి వెబ్ సిరీస్ చేసి ఓటీటీ ప్లాట్ ఫామ్ పై సక్సెస్ అయ్యింది. ఆమె చివరిసారిగా జీయో సినిమా ఓటీటీలో వచ్చిన రఫు చక్కర్ సిరీస్‌లో కనిపించింది. అలాగే ఆమె చేతిలో మరిన్ని ప్రాజెక్ట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 2007లో గోల్ అనే సినిమాతో మలయాళం సినిమాలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాతి ఏడాదిలోనే యువత సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.