Megastar Chiranjeevi: వరుణ్, లావణ్య పై ఇప్పటికీ కోపంగా ఉన్న చిరంజీవి.. ఎందుకంటే..
2017 నుంచి సీక్రెట్‌గా ప్రేమలో ఉన్న వీరిద్దరు .. గతేడాది జూన్‌లో నిశ్చితార్థంతో తమ లవ్ గురించి బయటపెట్టారు. మిస్టర్ సినిమా చిత్రీకరణ సమయంలో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. కానీ తమ లవ్ విషయంలో మాత్రం ఎప్పుడూ జాగ్రత్తగా ఉన్నారు. గతేడాది ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్, పెళ్లి కూడా జరిగిపోయాయి. అయితే వీరిద్దరి లవ్ విషయం మాత్రం ఇటు అభిమానులతోపాటు..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ 1న వీరిద్దరి వివాహం ఇటలీలో గ్రాండ్ గా జరిగింది. 2017 నుంచి సీక్రెట్‌గా ప్రేమలో ఉన్న వీరిద్దరు .. గతేడాది జూన్‌లో నిశ్చితార్థంతో తమ లవ్ గురించి బయటపెట్టారు. మిస్టర్ సినిమా చిత్రీకరణ సమయంలో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. కానీ తమ లవ్ విషయంలో మాత్రం ఎప్పుడూ జాగ్రత్తగా ఉన్నారు. గతేడాది ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్, పెళ్లి కూడా జరిగిపోయాయి. అయితే వీరిద్దరి లవ్ విషయం మాత్రం ఇటు అభిమానులతోపాటు.. అటు చిరంజీవికి కూడా చివరి నిమిషం వరకు తెలియదట. ఈ విషయాన్ని చిరు స్వయంగా చెప్పాడు. అందుకు వరుణ్ పై ఇప్పటికీ కోపంగానే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన చిరు.. వరుణ్, లావణ్య లవ్ స్టోరీ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుమ మాట్లాడుతూ.. చిరు లీక్స్ అంటే మాకు చాలా ఇష్టం.. సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మీరు లీక్ చేస్తుంటే ఎంజాయ్ చేశాం.. కానీ వరుణ్, లావణ్య లవ్ స్టోరీని ఎలా చేయకుండా.. మీకు కూడా లీక్ చేయలేదా ? అనే సందేహం ఉండిపోయింది అంటూ చిరును అడిగింది. దీనిపై చిరు స్పందిస్తూ.. “వరుణ్ నాతో ప్రతి విషయం చెబుతాడు. కానీ ఈ విషయంలో మాత్రం చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. నేను ఇన్స్పీరేషన్ అని చెబుతుంటాడు. ఈ లీక్స్ విషయంలోనూ నా నుంచి ఇన్స్పైర్ అయ్యి లావణ్యతో డేటింగ్ విషయం చెప్పాలి. తన తండ్రికి కూడా చెప్పని విషయాలను వరుణ్ నాతో చెబుతాడు. కానీ ఇది చెప్పనందుకు ఇప్పటికీ వరుణ్ పై నాకు కోపంగానే ఉంది ” అంటూ నవ్వుతూ రియాక్ట్ అయ్యారు.
దీనిపై నువ్వేమానా సంజాయిషీ ఇస్తావా వరుణ్ అంటూ సుమ అడగ్గా.. ‘అది గౌరవంతో కకూడిన భయం.. అందుకే జాగ్రతగా ఉన్నాను. కానీ మా ఫ్యామిలీలో ఫస్ట్ చెప్పింది పెదనాన్నకే ‘ అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే.. వరుణ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చి 1న విడుదలకు సిద్ధమయ్యింది. ఇందులో మానుషి చిల్లర్ కథానాయికగా నటించింది.
“లావణ్య విషయం ఒక్కటే నా దగ్గర దాచాడు ఇప్పటికీ కోపంగా ఉంది” – #Chiranjeevi#Varuntej #LavanyaTripathi pic.twitter.com/4yqEWavvf2
— Daily Culture (@DailyCultureYT) February 25, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.