Aadah Sharma: ఇదేం ఫ్యాషన్ రా బాబు.. ‘లీఫ్’ డ్రెస్ అంటూ నెట్టింట్లో రచ్చ చేస్తోన్న హీరోయిన్..

|

Jul 17, 2022 | 11:56 AM

మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ మూవీ హిట్ అయినప్పటికీ ఆదాకు మాత్రం అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లోనూ ఛాన్స్

Aadah Sharma: ఇదేం ఫ్యాషన్ రా బాబు.. లీఫ్ డ్రెస్ అంటూ నెట్టింట్లో రచ్చ చేస్తోన్న హీరోయిన్..
Aadah Sharma
Follow us on

యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆదా శర్మ (Aadah Sharma). మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ మూవీ హిట్ అయినప్పటికీ ఆదాకు మాత్రం అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లోనూ ఛాన్స్ వచ్చినప్పటికీ ఆదా మాత్రం హిట్ అందుకోలేకపోయింది. దీంతో తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు కరువయ్యాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆదా చేసే రచ్చ గురించి తెలిసిందే. వెరైటీ ఫోటోషూట్స్ అంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. సరికొత్త ఫ్యాషన్ డిజైన్ డ్రెస్‏తో ఫోటోలకు ఫోజులిచ్చింది ఆదా. ఇంతకీ ఈ బ్యూటీ ఏం చేసింది అనుకుంటున్నారా ? అయితే అసలు విషయం తెలుసుకోవాల్సిందే.

ఎప్పుడూ వెరైటీ ఫోటోషూట్స్ చేస్తూ నెట్టింట్లో షేర్ చేసే ఆదా.. తాజాగా లీఫ్ డిజైన్ డ్రెస్‏ ఫోటోస్ పోస్ట్ చేసింది. ఆకులతో డిజైన్ చేసిన గౌన్ ధరించి మరీ ఫోటోషూట్ చేసింది. ప్రకృతి చాలా గొప్పది.. మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉండనిస్తుంది. అన్ని జీవరాసులను స్వీకరించే శక్తి మానవులకే ఇచ్చింది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టన్నింగ్, బ్యూటీఫుల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.