AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yash Wife: నో జిమ్, నో డైట్.. 42 ఏళ్ల వయసులో 20 ఏళ్ల అమ్మాయిలా.. యశ్ సతీమణి ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన 'టాక్సిక్' సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో హీరో యశ్ వైఫ్ రాధికా పండిట్ పేరు కూడా ఇప్పుడు నెట్టింట బాగా వినిపిస్తోంది.

Yash Wife: నో జిమ్, నో డైట్.. 42 ఏళ్ల వయసులో 20 ఏళ్ల అమ్మాయిలా.. యశ్ సతీమణి ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే
Yash Family
Basha Shek
|

Updated on: Aug 20, 2026 | 8:25 PM

Share

ఒకప్పుడు కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రాధికా పండిట్. ఇదే క్రమంలో హీరో యశ్ తో ప్రేమలో పడింది. చాలా ఏళ్లు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట పెద్దల అనుమతిలో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇదిలా ఉంటే యశ్ భార్య గానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాధికా పండిట్. ముఖ్యంగా ఫిట్ నెస్ విషయంలో ఈ ముద్దుగుమ్మ పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. 42 ఏళ్ల వయసులో కూడా ఆమె చాలా ఫిట్‌గా, అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఫిట్‌గా ఉండటానికి రాధికా పండిట్ ఎలాంటి కఠినమైన ఆహార నియమాలు పాటించదు. అలాగే గంటల తరబడి జిమ్ వర్కౌట్స్ కూడా చేయదు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూకు హాజరైన రాధిక తన ఫిట్ నెస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. దీని ప్రకారం కొన్ని సింపుల్ హ్యాబిట్స్ తోనూ మన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చు.

‘ మొదట్లో నేను చాలా తక్కువ బరువు ఉండేదాన్ని. ఈ కారణంగా చాలా సినిమా అవకాశాలను కోల్పోవాల్సి వచ్చింది. ఆ దీంతో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ పెట్టడం ప్రారంభించాను’ అని అంటోంది రాధిక. అయితే ఇందుకోసం ఆమె జిమ్ లేదా కఠినమైన ఆహార నియమాల మార్గాన్ని ఎంచుకోలేదు. నృత్యం, యోగా, నడక అనేవి మూడు ముఖ్యమైన అంశాలను తన ఫిట్‌నెస్ దినచర్యలో భాగం చేసుకుంది రాధిక. మరీ ముఖ్యంగా నృత్యం అంటే రాధికకు చాలా ఇష్టం.అందుకే జుంబా లేదా ఇతర డ్యాన్స్ స్కిల్స్ తో తనను తాను ఫిట్ గా ఉంచుకుంది. దీంతో పాటు ప్రతిరోజూ ఉదయం పూట సూర్య నమస్కారాలు, యోగా, తేలికపాటి వ్యాయామాలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆ తర్వాత, సుమారు 30 నిమిషాల పాటు నడవడం కూడా అలవాటుగా చేసుకుంది రాధిక.

ఇవి కూడా చదవండి

రాధిక ప్రకారం, ఫిట్‌గా ఉండటానికి ఎల్లప్పుడూ జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టమైన శారీరక కార్యకలాపాలను క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ శరీరం చురుకుగా, ఫిట్‌గా ఉంటుంది. రాధిక శాకాహారి. తన ఆహారంలో ఇంట్లో వండిన సాధారణ భోజనాన్ని ఇష్టపడుతుంది. రాత్రి భోజనంలో వెజిటబుల్ బ్రెడ్ లేదా పోలి సలాడ్ తినడానికి ఇష్టపడుతుంది. ఆమెకు ఆకలి వేసినప్పుడు, స్నాక్స్‌గా పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటుంది.

యశ్ సతీమణి రాధికా పండిట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us