AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : చిరంజీవికి బెస్ట్ ఫ్రెండ్.. హీరోగా 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే.. తెలుగులోనే తోపు కమెడియన్..

ఒకప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హీరో. దాదాపు 40కి పైగా సినిమాల్లో నటించారు. కానీ తర్వాత హాస్య నటుడిగా మారారు. తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో కమెడియన్ గా అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. అప్పట్లో హీరోగా రజినీకాంత్ కే పోటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు ? అనే విషయాలు తెలుసుకుందామా.

Tollywood : చిరంజీవికి బెస్ట్ ఫ్రెండ్.. హీరోగా 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే.. తెలుగులోనే తోపు కమెడియన్..
Sudhakar
Rajitha Chanti
|

Updated on: Aug 20, 2026 | 6:50 PM

Share

తెలుగు చిత్రపరిశ్రమలో ఆయన తోపు కమెడియన్. సహజమైన నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాలు గెలుచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలకు పోటీగా హీరోగా అనేక హిట్ మూవీస్ చేశారు. స్టార్ హీరో కావాల్సిన ఆయన.. అనుహ్యంగా కమెడియన్ అయ్యారు. హాస్య నటుడిగా తనదైన ముద్ర వేసిన ఆ నటుడు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆయన మరెవరో కాదు… కమెడియన్ సుధాకర్. తెలుగు, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. సుధాకర్ పేరు వినగానే మనందరికీ ఒక విలక్షణమైన యాస, ముఖంలో చిరునవ్వు గుర్తొస్తాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర కథానాయకుల సినిమాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన ఆయన వెనుక ఒక పెద్ద స్టార్ హీరో ప్రయాణం ఉంది. ఒకప్పుడు హీరోగా, ఆ తర్వాత విలన్ గా నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. సుధాకర్ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరికి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారంటే ఆయన క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

ఎక్కువమంది చదివినవి : Hemachandra : శ్రావణ భార్గవితో విడాకులు ?.. రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర.. ఏమన్నారంటే..

ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన సుధాకర్, డిప్యూటీ కలెక్టర్ కుమారుడు. నటనపై మక్కువతో చెన్నై యాక్టింగ్ స్కూల్‌లో చేరినప్పుడు చిరంజీవి ఆయనకు రూమ్ మేట్. ఇద్దరూ మంచి స్నేహితులు. అయితే చిరంజీవి కంటే ముందే సుధాకర్‌కు కథానాయకుడిగా అవకాశం దక్కింది. తమిళంలో భారతిరాజా దర్శకత్వంలో వచ్చిన ‘కిళక్కే పోగుమ్ రైల్’ చిత్రంతో అరంగేట్రం చేసిన సుధాకర్ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయారు. ఆ తర్వాత తమిళంలో వరుసగా 40కి పైగా సినిమాల్లో హీరోగా నటించి, అప్పట్లో రజనీకాంత్ వంటి అగ్ర హీరోలకే పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగారు

ఎక్కువమంది చదివినవి : Cinema : ఓటీటీలో వణుకు పుట్టించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ..

కాలక్రమేణా తమిళంలో అవకాశాలు తగ్గడం, రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయన మళ్లీ తెలుగు వైపు వచ్చారు. తెలుగులో చిరంజీవి అప్పటికే స్టార్ హీరోగా స్థిరపడటంతో సుధాకర్ ఇక్కడ విలన్ పాత్రలతో ప్రయాణం ప్రారంభించారు. అయితే ఆయనలోని టైమింగ్ గుర్తించిన దర్శకులు ఆయనను కమెడియన్‌గా మార్చారు. తన ప్రత్యేకమైన శైలి, పంచ్‌లతో ‘యముడికి మొగుడు’, ‘శుభాకాంక్షలు’, ‘పెళ్లి పీటలు’ వంటి అనేక చిత్రాల్లో నటించి నవ్వుల పువ్వులు పూయించారు. నిర్మాతగా మారి ‘యముడికి మొగుడు’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించారు. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్లిన సుధాకర్, కోలుకుని రావడం ఒక మిరాకిల్. ఒకప్పుడు తమిళంలో స్టార్ హీరోగా వెలిగిన వ్యక్తి, తెలుగులో కమెడియన్‌గా స్థిరపడినా ఏ పాత్రనైనా తనదైన నటనతో పండించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నా, ఆయన అందించిన కామెడీ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది.

ఎక్కువమంది చదివినవి : Mokshagna : వారసుడు వచ్చేస్తున్నాడు.. దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

సుధాకర్ ఫోటో..

View this post on Instagram

A post shared by G Sudhakar (@sudhakarreal)

ఎక్కువమంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే.. ఆ నిర్ణయమే పొరపాటు అయ్యింది..

Follow Us