Sanjeev Movie Trailer: సినిమా కలలు.. రియాలిటీ సవాళ్లు.. ఆకట్టుకుంటున్న సంజీవ్ ట్రైలర్..
ఓటీటీలో ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ సినిమాలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నూతన నటీనటులకు, దర్శకులు తమ ప్రతిభతో గుర్తింపు సంపాదించుకుంటున్నారు. తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వేదికగా మరో ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. అదే సంజీవ్. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని సాధారణ కుర్రాడు ఈ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో, విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. చిన్న సినిమాలు, కొత్త నటీనటుల ప్రతిభకు వేదికగా నిలుస్తున్న ఆహా, తాజాగా ‘సంజీవ్’ అనే సరికొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ సినిమా అధికారిక ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకులలో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కథ ఒక సాధారణ యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసి, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి థియేటర్ ఆర్ట్స్ నేర్చుకున్న సంజీవ్ అనే కుర్రాడు సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెడతాడు. ఒక్క అవకాశం కోసం ఆ యువకుడు చేసే పోరాటే ఈ సినిమా. ఇందులో సినీరంగంలో నిలదొక్కుకోవడానికి పడే శ్రమ, ఎదుర్కొనే సవాళ్లను ఈ సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నారు. “ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నానో నాకు తెలుసు, ఒక మంచి రోల్ దొరికితే చాలు” అని తపించే ఒక వర్ధమాన నటుడి ప్రయాణాన్ని ట్రైలర్‌లో ఎంతో సహజంగా ఆవిష్కరించారు.
ఎక్కువమంది చదివినవి : Hemachandra : శ్రావణ భార్గవితో విడాకులు ?.. రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర.. ఏమన్నారంటే..
సినిమా అవకాశాల కోసం తిరిగే క్రమంలో ఫ్రెండ్స్ ఇచ్చే సపోర్ట్, “ఒక్క సినిమా హిట్ అయితే మొత్తం సెట్ అయిపోతుంది” అనే ఆశ, మరోవైపు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారినప్పుడు కలిగే తీవ్రమైన వేదన, ఆవేదనల కలబోతగా ఈ ట్రైలర్ సాగింది. కుటుంబంలో వచ్చే ఒత్తిళ్లు, “కనీసం నీ ఖర్చులు నువ్వు సంపాదించుకోవచ్చు కదా” అని ఇంట్లోవాళ్లు అనే మాటలు, సమాజం నుంచి ఎదురయ్యే హేళనలను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. అనిల్ నక్కా, భూపతి కేవై, జాన్ కే జోసెఫ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో నటీనటుల పర్ఫార్మెన్స్, సంభాషణలు ఎంతో రియలిస్టిక్‌గా ఉన్నాయి.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఓటీటీలో వణుకు పుట్టించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ..
ముఖ్యంగా “సక్సెస్ అనేది ఇన్స్టెంట్ గా రాదు, టైమ్ పడుతుంది, వెయిట్ చేయాలి” అని చెప్పే డైలాగ్స్ ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఈ చిత్రం ఆగస్టు 21న నేరుగా ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రీమియర్ కానుంది. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించే ప్రతీ ఒక్కరి జీవితానికి అద్దం పట్టేలా ఉన్న ఈ ‘సంజీవ్’ చిత్రం ఆహా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది.
ఎక్కువమంది చదివినవి : Mokshagna : వారసుడు వచ్చేస్తున్నాడు.. దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
సంజీవ్ ట్రైలర్..
ఎక్కువమంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్‌తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే.. ఆ నిర్ణయమే పొరపాటు అయ్యింది..
