
తమిళ్ హీరో విశాల్ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఓ వారం రోజుల క్రితం కోలీవుడ్ హీరో విశాల్.. ఓ ఈవెంట్ లో పాల్గొనేందుకు వెళ్లాడు. అక్కడ వచ్చిన వాళ్లతో మాట్లాడుతూ ఆకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో విశాల్ కు ఏమైందా ? అని అందరూ కంగారు పడ్డారు. విశాల్ ఆరోగ్య పరిస్థితి పై అభిమానులు ఆందోళనకు గురయ్యారు. విశాల్ శరీరంలో సరిగ్గా ఆహారం తీసుకోకపోవడంతో ఇమ్యూనిటీ తగ్గి కళ్లు తిరిగి పడిపోయారని ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. అయితే విశాల్ ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వైరలయ్యాయి. తాజాగా విశాల్ ఆరోగ్యంగా కనిపిస్తున్న ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.
కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉన్న విశాల్.. తాజాగా చెన్నై ఎయిర్ పోర్టులో హీరో విజయ్ సేతుపతితో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. చాలా రోజుల తర్వాత తన డార్లింగ్ స్నేహితుడిని కలిశానని.. కాసేపు తనతో మాట్లాడానని చెబుతూ విజయ్ సేతుపతితో కలిసి దిగిన ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేశారు విశాల్. ఇక ఈ ఫోటోలో విశాల్ ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు. దీంతో విశాల్ ఆరోగ్యం మెరుగుపడిందని.. తిరిగి సినిమాల్లో బిజీ కానున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. కొన్నాళ్ల క్రితం విశాల్ పూర్తిగా బక్కిచిక్కి గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు. ఆ సమయంలో విశాల్ చేతులు వణుకుతూ.. సరిగ్గా చూడలేక ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఇక ఆ తర్వాత తిరిగి కోలుకున్న విశాల్.. ఇప్పుడు మరోసారి కళ్లు తిరిగి పడిపోవడంతో విశాల్ కు ఏమైంది అంటూ ఆందోళనకు గురయ్యారు ఫ్యాన్స్. ఇక ఇప్పుడు నెట్టింట వైరలవుతున్న ఫోటో చూస్తుంటే విశాల్ ఆరోగ్యం మెరుగుపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు తుప్పరివాలన్ 2 చిత్రంలో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..
Tollywood: రస్నా యాడ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?
Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..