Vijay Deverakonda: సినిమా చేశాక ఆపేద్దాం అన్నారు.. కానీ.. విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న యంగ్ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. హిట్టు, ప్లాపులతో ఎలాంటి సంబంధం లేకుండా నిత్యం విభిన్న కథలతో సినీప్రియులను అలరిస్తున్నారు. ప్రస్తుతం కింగ్ డమ్ చిత్రంలో నటిస్తున్నారు విజయ్. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.

Vijay Deverakonda: సినిమా చేశాక ఆపేద్దాం అన్నారు.. కానీ.. విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్..
Vijay Devarakonda

Updated on: May 18, 2025 | 6:16 PM

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్ డమ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన న్యూ హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇప్పుడు కింగ్ డమ్ ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అయితే తాను నటించిన ఓ సినిమాను విడుదల చేయకుండా ఆపేద్దామని నిర్మాతలు అనుకున్నారని.. కానీ సంగీత దర్శకుడి మార్పుతో సినిమాపై నమ్మకం కలిగి రిలీజ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆ సినిమా మరెదో కాదు.. సూపర్ హిట్ టాక్సీవాలా.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ టాక్సీవాలా స్క్రిప్ట్ విన్నప్పుడే బాగా నవ్వుకున్నాను. ఈ సినిమా పూర్తయ్యాక ప్రతి సన్నివేశం మానిటర్ లో అవుట్ పుట్ చూసినప్పుడు నవ్వుకున్నాం. ఎడిటింగ్ పూర్తైన తర్వాత విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో చెన్నైలో నోటా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాను. కానీ టాక్సీవాలా పైనల్ అవుట్ పుట్ చూసిన నిర్మాతలు నాకు ఫోన్ చేసి వెంటనే హైదరాబాద్ రమ్మన్నారు. వాళ్ల వాయిస్ లోని సీరియస్ నెస్ అర్థమయ్యింది. మనసులో టెన్షన్ మొదలైంది.

హైదారాబాద్ వచ్చిన వెంటనే అల్లు అరవింద్ గారిని కలిశా. ఈ సినిమా వర్కవుట్ కాదు.. ఆపేద్దాం అన్నారు. తదుపరి సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేద్దాం అన్నారు. దీంతో మళ్లీ సినిమా చూద్దాం అని చెప్పాను. ఆ సినిమా చూసిన తర్వాత నాకు నవ్వు రాలేదు. ఎందుకంటే సినిమా జానర్ కు నేపథ్య సంగీతం వేరుగా ఉండడంతో ఇలా జరిగిందని అర్థమయ్యింది. మరో మ్యుజిక్ డైరెక్టర్ ను సెట్చేస్తాం.. టైమ్ ఇవ్వడి అని అరవింద్ సర్ కు అడిగాను.. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బెజోయ్ ను కలిసి సినిమా గురించి చెప్పాం. అతడు అందించిన మ్యూజిక్ సినిమా హిట్ కావడానికి కారణమయ్యింది” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి :  

Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..

Tollywood: రస్నా యాడ్‏లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?

Tollywood: అప్పుడు ఐశ్వర్య రాయ్‏కే చెమటలు పట్టించింది.. కట్ చేస్తే.. ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్..

Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..