Liger: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. లైగర్ రిలీజ్ డేట్.. గ్లింప్స్ డేట్ ప్రకటించిన చిత్రయూనిట్..
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో డైనమికి డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం లైగర్. బాక్సింగ్
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో డైనమికి డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు పూరి. లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ కి అనన్య పాండే టాలీవుడ్ కి ఒకే సారి పరిచయం కానున్నారు. విజయ్ బాక్సర్‌గా కనిపిస్తోన్న ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. లైగర్ సినిమా కోసం రౌడీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా లైగర్ మూవీ నుంచి రెండు క్రేజీ అప్డేట్స్ ఇచ్చింది చిత్రయూనిట్.
పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 25న విడుదల చేయనున్నారు. అలాగే.. కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 31న లైగర్ నుంచి గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఇక . ఇక ఈ సినిమా కీలక పాత్రలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మైక్ టైసన్ తో సన్నివేశాలను అమెరికాలో చిత్రీకరించారు. లైగర్ చిత్రాన్ని.. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి కౌర్ – కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలసి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ట్వీట్..
It’s Time. A long journey culminates in Two very important dates!
Stay Ready.. And Remember the words that have been said. #Liger pic.twitter.com/XZT9irEorb
— Vijay Deverakonda (@TheDeverakonda) December 16, 2021
Rashmika Mandanna: రష్మికను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..