Social Media Stars 2021: ఈ ఏడాది సోషల్ మీడియాలో సత్తా చాటిన స్టార్స్ వీరే.. లక్షల్లో ఆదాయం..
ప్రస్తుతం సోషల్ మీడియాలో వాడకం మరింత పెరిగిపోయింది. కరోనా మహామ్మారి వలన ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య గణనీయంగా
ప్రస్తుతం సోషల్ మీడియాలో వాడకం మరింత పెరిగిపోయింది. కరోనా మహామ్మారి వలన ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. లాక్ డౌన్ వలన ఇంటికే పరిమితం కావడం.. థియేటర్లు మూత పడడం.. భారీ సినిమాలు రాకపోవడం వలన యూట్యూబ్ చూసే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోయింది. అలాగే ఓటీటీ యూజర్ల బేస్ అమాంతం అధికమైంది. ఈ ఏడాది ఓటీటీ సంస్థలకు కాసుల వర్షం కురిసింది అని చెప్పుకొవడంలోనూ సందేహం లేదు. అలాగే కరోనా మహమ్మారి పుణ్యమా అని.. వెబ్ సిరీస్.. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా చిన్న చిన్న నటీనటులు తెగ క్రేజ్ సంపాదించుకున్నారు. దేశవ్యాప్తంగా యూట్యూబ్ ప్రేక్షకుల సంఖ్య భారీగానే పెరిగింది. అయితే ఈ ఏడాది ఎక్కువగా వెబ్ సిరీస్ హావా కొనసాగింది. అయితే ఈ వెబ్ సిరీస్ వలన యూట్యూబ్‌లో రాత్రికి రాత్రి స్టార్స్ అయిన వాళ్లు ఉన్నారు. ఈ ఏడాది సోషల్ మీడియాలో సత్తా చాటిన స్టార్స్ ఎవరో తెలుసుకుందామా..
30 Weds 21- అనన్య.. 30 ఏళ్ల బ్యాచిలర్‌కు 21 ఏళ్ల యువతికి వివాహం జరిగితే వారి మధ్య భావోద్వేగాలు.. చిలిపి అల్లర్లు ఎలా ఉంటాయనే కాన్సెప్ట్‌తో వచ్చి నెటిజన్లకు ఆకట్టుకుంది 30 వెడ్స్ 21. ఇందులో నటించిన తెలుగమ్మాయి అనన్య కుర్రాళ్ల కళల రాకూమారిగా మారింది. ఈ వెబ్ సిరీస్‌తో అనన్య క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్న అనన్య ఇప్పుడు కుర్రాళ్ల క్రష్.
30 Weds 21- చైతన్య రావు.. 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్‌లో హీరోగా పృథ్వీ పాత్రలో నటించి మెప్పించాడు చైతన్య రావు. కొత్తగా పెళ్లైన కుర్రాడిగా, అమాయకపు భర్తగా, ఉద్యోగిగా, మంచి స్నేహితుడిగా అందరికి కనెక్ట్ అయ్యాడు చైతన్య. లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాన్ని వచ్చి నటనపై ఆసక్తితో వచ్చిన చైతన్య 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్‌తో సూపర్ హిట్ అందుకున్నాడు.
సూర్య- మౌనిక.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ప్రధాన పాత్రలో నటించిన సూర్య వెబ్ సిరీస్ ఎంతగా హిట్ అయ్యిందో తెలిసిన సంగతే. ఇందులో సూర్య సరసన అంజలి పాత్రలో నటించి మెప్పించింది మౌనిక రెడ్డి. తెలివైన అమాయకపు ప్రియురాలిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది మౌనిక రెడ్డి సూర్య వెబ్ సిరీస్‌తో అత్యంత పాపులారిటీని సంపాదించుకుంది.
సూర్య – షణ్ముఖ్ జస్వంత్.. సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‌తో సూపర్ హిట్ అందుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. ఆ తర్వాత వచ్చిన సూర్య వెబ్ సిరీస్ కూడా యూట్యూబ్‌తో ట్రెండ్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలోయింగ్ సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్నారు.
అలేఖ్య హారిక.. తెలంగాణ యాసతో..మాస్ అమ్మాయిగా యూట్యూబ్ వీడియోలతో ఎక్కువగా ఫేమస్ అయ్యింది అలేఖ్య హారిక. దేత్తడి ఛానల్లో అలేఖ్య చేస్తున్న వీడియోలకు ఎక్కువగానే క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌తో హారికకు బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ 5లో ఒకరిగా నిలిచింది హారిక.
మై విలేజ్ షో- గంగవ్వ.. మై విలేజ్ షో గంగవ్వ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు.. గంగవ్వ అంటే ఇప్పుడు ప్రపంచమంతా పరిచయమే.. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం.. కల్మషం లేని మనసు.. ఆరుపదుల వయసులో ప్రపంచానికి స్టార్‌గా పరిచయమైంది గంగవ్వ.. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్‌లో నటించిన గంగవ్వ ఇప్పుడు వెండితెరపై తన నటనతో ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ సీజన్ 4లోనూ గంగవ్వ అలరించింది.
మై విలేజ్ షో- అనిల్ గీలా.. ఉపాద్యాయుడిగా విద్యార్థులను విద్యాబుద్దులు బోధిస్తూనే.. యూట్యూబ్‌లోని మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అనిల్. ప్రస్తుతం యూట్యూబ్‌లో అనిల్ గీలా వోల్గ్స్ అనే ఛానల్ నిర్వహిస్తూనే.. మరోవైపు మై విలేజ్ షోలో షార్ట్ ఫిల్మ్ చేస్తూ.. వెండితెరపై కూడా తన నటనతో ఆకట్టుకుంటూ యూత్ ఐకాన్‌గా నిలిచాడు అనిల్.
శ్రీహాన్.. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు శ్రీహాన్. అయితే అంతకంటే ఎక్కువగా బిగ్ బాస్ 5 కంటెంస్టెట్ సిరి హన్మంత్ ప్రియుడిగానూ మరింత పాపులర్ అయ్యాడు శ్రీహాన్.
సిరి హనుమంతు.. సిరి హనుమంతు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్‌లో హీరోయిన్‌గానే కాకుండా.. విలన్ పాత్రలలోనూ నటించి మెప్పించింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా రాణిస్తోంది.
Rashmika Mandanna: రష్మికను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..